Begin typing your search above and press return to search.
మళ్ళీ చందూకి రాజమౌళి కాంప్లిమెంట్
By: Tupaki Desk | 17 Aug 2015 5:07 PM GMTమొత్తానికి ఒక్కసారి తనకు కంటెంట్ నచ్చిందంటే.. సదరు కంటెంట్‌ను తీర్చిదిద్దిన ప్రతిభావంతులకు ఎన్నిసార్లైనా కితాబులిస్తాడు రాజమౌళి. టాలెంట్ ఉన్న ఎంతోమందిని స్వయంగా తానే ట్విట్టర్ లో ప్రస్తావించి ప్రజలంరకూ తెలిసేలా పరిచయం చేస్తాడు.. గతంలో సంపూర్ణేష్ బాబును స్టార్ ను చేసింది రాజమౌళి ట్వీట్ లే . అయితే ఆల్రెడీ తన కంటెంట్ తో విపరీతమైన పేరు తెచ్చుకున్న ఓ యువ దర్శకుడికి జక్కన్న ఇస్తున్న ప్రోత్సాహం అమోఘం అనిపిస్తోంది.
నిజానికి కార్తికేయ సినిమాను తీసిన నూతన దర్శకుడు చందూ మొండేటికి అప్పటికే విపరీతమైన కాంప్లిమెంటులు వచ్చేశాయి. ఇక తరువాత రాజమౌళి కూడా, చందూపై అభినందనల జల్లు కురిపించాడు. ఆ మొమెంట్ లో రాజమౌళి ఇచ్చిన ఆ ఎంకరేజమెంట్ తాలూకు కిక్కుతో చందూ కూడా హ్యాపీగానే ఫీలయ్యాడులే. అదే సమయంలో లెజండరీ కమల్ హాసన్ కూడా కార్తికేయ సినిమా గురించి అభినందించాడు.
ఇకపోతే ఈ కొత్త డైరక్టర్ గురించి మరచిపోకుండా మరోసారి రాజమౌళి తాను నిర్వహిస్తున్న ఓ ప్రత్యేక ఇంటర్యూ కార్యక్రమానికి ఆహ్వానించాడు. అక్కడ మరోసారి తన అభినందనలు తెలియజేస్తూ చందూకి ఒక జ్ఞాపికను కూడా అందించాడు జక్కన్న. బాహుబలి బాగుంది సార్ అంటూ చందూ కితాబిస్తే.. నువ్వు తీసిన కార్తికేయ ఇంకా బాగుందయ్యా అంటూ పొగిడేశాడట. ఇలాంటి చిన్న చిన్న డైరక్టర్లకు అలాంటి లెజెండుల పొగడ్తలంటే పెద్ద విషయమే మరి. అవి మరిన్ని మంచి సినిమాలు తీయడానికి వారికి ఊతమిస్తాయి. వారిలో కొత్త ఎనర్జీని నింపుతాయి.
ఇదే విషయంపై తుపాకి.కాం తో చందూ మాట్లాడుతూ.. ''అలాంటి లెజండ్ నాకు డైరక్టుగా పిలిచి ఒక మెమెంటో అందివ్వడం అనేది నా జీవితంలోనే నాకు అందిన అత్యంత విలువైన కానుక. ఈ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. బాహుబలి తీస్తూ బిజీగా ఉండి కూడా మా సినిమాను చూసి మెచ్చకున్నారు, ఇప్పడు కాస్త తీరిక దొరకగ్గానే ఒక జ్ఞాపికను అందించారు.. మీ ఎంకరేజమెంట్ కు కృతార్ధుడని సార్...'' అంటూ రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాడు. అదిరిందయ్యా చందూ!!!