Begin typing your search above and press return to search.

నాటు నాటు అవార్డ్.. చంద్రబోస్ ఎమోషనల్..!

By:  Tupaki Desk   |   12 Jan 2023 6:21 AM GMT
నాటు నాటు అవార్డ్.. చంద్రబోస్ ఎమోషనల్..!
X
800 సినిమాలకు 3600 పైగా పాటలు రాసిన చంద్రబోస్ ఆయన రాసిన ఆర్.ఆర్.ఆర్ సినిమాకు లో ఆయన రాసిన నాటు నాటు సాంగ్ కీరవాణి మ్యూజిక్ అందించగా ఆ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావడం పట్ల కీరవాణి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్, కాళభైరవలకు థ్యాంక్స్ చెప్పాడు. తను రాసిన పాట ప్రెస్టీజియస్ అవార్డు అందుకోవడం పట్ల చంద్రబోస్ భావోద్వేగానికి గురయ్యారు.

అవార్డ్ అందుకున్న వెంటనే తానొక వీడియో మెసేజ్ ఇవ్వగా లేటెస్ట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మరింత ఎమోషనల్ అయ్యారు. ప్రతి పాటకు తను ఎంతో కష్టపడతాను అని.. తన నిర్మాతలను.. దర్శకులను.. హీరోలకు నచ్చేలా పాట రాయడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని.

పాటలను రాసే క్రమంలో తాను ఫ్యామిలీని కూడా దూరంగా పెడుతుంటాను ఆ టైం లో తనకు తాను ఒంటరినవుతానని.. అందరిని మెప్పించేలా పాటలు రాయడానికి భయపడుతూ రాస్తానని అన్నారు చంద్రబోస్.

ఇక తన తండ్రి తనతో ఉన్నా తన మదర్ లేరని. ఆమె పై నుంచి కూడా తన ఆశీస్సులు అందిస్తుందని అన్నారు. తన తల్లి చదువుకోకపోయినా ఆమెకు కూడా తన పాటలు అర్ధమయ్యేలా తాను రాస్తానని అన్నారు.

చంద్రబోస్ రాసిన పాటలు ఈమధ్య సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. 1995లో తాజ్ మహల్ సినిమాకు తన మొదటి పాట అందించిన చంద్రబోస్ 28 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలను అందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

ఏ వ్యక్తికైనా తను చేసిన పనికి ఒక పురస్కారం అది కూడా ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చేలా అవార్డ్ వస్తే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఆ టైం లో కొద్దిగా ఎమోషనల్ అవడం కూడా కామన్. ప్రస్తుతం చంద్రబోస్ కూడా తన పాటకు జరిగిన ఈ సత్కారానికి తను కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.