Begin typing your search above and press return to search.

'వాస‌న సుహాస' గీతంపై చంద్ర‌బోస్ ప్ర‌శంస‌లు!

By:  Tupaki Desk   |   29 Dec 2022 10:34 AM GMT
వాస‌న సుహాస గీతంపై  చంద్ర‌బోస్ ప్ర‌శంస‌లు!
X
యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మెరుపు వేగం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ వేవ్ లా ముందుకు సాగిపోతున్నాడు. 'రాజావారు రాణీవారు'..'ఎస్ ఆర్ క‌ళ్యాణమండంపం' సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని దూసుకుపో తున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని ఫెయిల్యూర్స్ కాస్త డిస్ట‌బెన్స్ క్రియేట్ చేసిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం యంగ్ హీరో పై పెద్ద‌గా ప‌డ‌లేదు.

త‌న‌దైన‌ ఛామ్..ఎన‌ర్జీతో టాలీవుడ్ లో ఓ ఐడెంటిటీ ని రెండు సినిమాల‌తోనే వేయ‌గ‌లిగాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో లైన‌ప్ కూడా బాగుంది. ప్రస్తుతం మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న 'వినరో భాగ్యము విష్ణు కథ' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నా రు.

'భలే భలే మగాడివోయ్'..' గీత గోవిందం'.. 'టాక్సీవాలా'.. 'ప్రతిరోజూ పండగే'.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' .. '18 పేజెస్' లాంటి చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వ‌స్తోన్న సినిమా ఇది. ఇందులో కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే యూనిట్ 'వాసవసుహాస' అనే మొదటి లిరిక‌ల్ సింగిల్ ని రిలీజ్ చేసింది.

'యుగ యుగాలుగా ప్రభోదమై..పది విధాలుగా పదే పదే.. పలికేటి సాయ..జాడలే కదా నువ్వెదికినదిదైనా..చిరునికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా..చిగురేయక అగురా..నిన్ను మార్చినా నిన్నటి అంచునా అని క్లిష్టమైన పదాలను ఈ పాటలో రచించారు గీత‌ రచయిత కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. ఈ పాటకు శ్రోత‌ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సంగీత ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

తాజాగా ఈ పాట‌ని మ‌రో గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ మెచ్చారు. ఈ పాటపై బోస్ ప్ర‌శంస‌లు కురిపించారు. 'నేను ఈమధ్య విన్న పాటల్లో చాలా అరుదైన..విలువైన పాట ఇది. వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట.-వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం-రాయడానికి ఎంత ప్రతిభ వుండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి భాషా సంస్కరం వుండాలి. కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయ పూర్వక ప్ర‌శ‌సంలు తెలుపుతున్నా' అన్నారు.

పైన ప్రస్తావించిన లిరిక్స్ లో 'వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది. అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా' అంటూ ఓ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి.. శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 17న రిలీజ్ చేయ‌నున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.