Begin typing your search above and press return to search.

చంద్రబాబు రానాకు ఏం చెప్పాడు?

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:08 AM GMT
చంద్రబాబు రానాకు ఏం చెప్పాడు?
X
మహానటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో నారా చంద్రబాబు నాయుడి పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తలిసిందే. మరి బాబు పాత్ర కోసం రానా ఎలా సన్నద్ధమవుతున్నాడు.. ఎవరి ఇన్ పుట్స్ తీసుకుంటున్నాడన్నది ఆసక్తి రేకెత్తించింది. ఐతే రానా ఈ విషయంలో వాళ్లనూ వీళ్లనూ నమ్ముకోలేదు. నేరుగా చంద్రబాబు దగ్గరికే వెళ్లిపోయాడు. దర్శకుడు క్రిష్.. హీరో బాలయ్యలతో కలిసి చంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిశాడు రానా. ఈ సందర్భంగా తన పాత్ర విషయంలో బాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల పాటు చంద్రబాబు దగ్గరే ఉండి.. ఆయన బాడీ లాంగ్వేజ్.. మాట తీరును రానా గమనించాడట.

మరి తన పాత్ర విషయంలో బాబు ఏం చెప్పి ఉంటాడు.. ఎంత వరకు చెప్పి ఉంటాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ తో చంద్రబాబు బంధం గురించి ప్రస్తావించాల్సి వస్తే వెన్నుపోటు వ్యవహారమే గుర్తుకొస్తుంది అందరికీ. ఐతే సినిమాలో ఇలాంటి నెగెటివ్ విషయాలు చూపిస్తారని ఆశిస్తే అది భ్రమే అవుతుంది. బహుశా ఎప్పుడూ చెప్పినట్లే ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తెచ్చింది తానే అని.. రాజకీయాల గురించి పెద్దగా తెలియని ఎన్టీఆర్ కు అన్నీ తానై వ్యహరించానని చెబుతూ.. ఏ సందర్భంలో ఏం చేసిందీ ఉదాహరణలు వివరించారేమో బాబు గారు. ఏదేమైనా చంద్రబాబు పాత్రకు రానా అనగానే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రానా మంచి నటుడే కానీ.. చంద్రబాబును అతను సరిగ్గా అనుకరించగలడా.. ఆ బాడీ లాంగ్వేజ్.. మాట తీరును మ్యాచ్ చేయగలడా అన్న సందేహాలు లేకపోలేదు.