Begin typing your search above and press return to search.

ఇంతకీ ఇది ఎవరి బయోపిక్కు?

By:  Tupaki Desk   |   22 Feb 2019 11:28 AM GMT
ఇంతకీ ఇది ఎవరి బయోపిక్కు?
X
ఇవాళ మహానాయకుడు ఎలాంటి అట్టహాసం లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసాడు. స్పందన ఎలా ఉందనేది పక్కన పెడితే సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులకు ఇది ఎన్టీఆర్ బయోపిక్కా లేక చంద్రబాబునాయుడు బయోపిక్కా అనే అనుమానం కలగడం అబద్దం కాదు. ఎందుకంటే రానా పాత్ర పరిచయం అయ్యాక తెలుగుదేశంలో జరుగుతున్న కీలక పరిణామాలన్నీ బాబే కనిపెట్టుకుని ఉన్నట్టు నాదెండ్ల భాస్కర్ రావు కుర్చీని కుట్రలు చేసి లాక్కున్న తర్వాత అంతా తానై చక్రం తిప్పినట్టు ఓ రేంజ్ లో హై లైట్ చేసారు.

ఎంతగా అంటే ఆ సమయంలో చంద్రబాబు కనక లేకపోయి ఉంటే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉండేవారు కారేమో అనే ఫీలింగ్ కలిగేంత. రామకృష్ణ స్టూడియోస్ లో ఏంఎల్ఏలను దాచడం వాళ్ళను ఢిల్లీకి తీసుకెళ్ళడం లాంటి పనుల్లో బాబు పాత్ర చాలానే ఉండొచ్చు. అయితే అది ఎన్టీఆర్ ఆదేశాల మేరకు జరిగి ఉండొచ్చు కాని బాబు స్వయంగా అన్ని చేసినట్టు చూపడం ఎందుకో అతకలేదు అనిపించింది. అంతే కాదు రానా రూపంలో బాబు మీద అక్కడక్కడా హీరోయిజం పండించే ప్రయత్నాలు కూడా జరిగాయి

మొత్తంగా ఎన్టీఆర్ మీద జరిగిన రాజకీయ వెన్నుపోటులో గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పేరే వినిపిస్తుండటంతో అది కవర్ చేసేందుకే కొన్ని సన్నివేశాలను పొందుపరిచారని అప్పటి ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు పాత తరం ప్రేక్షకులు సినిమా చూసాక వ్యాఖ్యానించడం గమనార్హం. రానా ఇమేజ్ కోసమో లేక బాబు గారి ఇమేజ్ ను పెంచడం కోసమో తెలియదు కాని మహానాయకుడులో చంద్రబాబుని వీర నాయకుడిగా చూపించే పనిని మాత్రం క్రిష్ చక్కగా పూర్తి చేసాడు. ఇదంతా బాలయ్య సూచనల మేరకే స్క్రిప్ట్ లో పొందుపరచడం జరిగిందా లేక ఇంకేదైనా కారణం ఉందా ఆ ఇద్దరికే తెలియాలి