Begin typing your search above and press return to search.
'యాత్ర' లో బాబు పాత్రపై క్లారిటీ
By: Tupaki Desk | 29 Jan 2019 10:24 AM GMTవైఎస్ ఆర్ బయోపిక్ 'యాత్ర' విడుదలకు సిద్దం అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అతి త్వరలో జగన్ ముఖ్య అతిథిగా జరిపేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో వైఎస్ ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ పోషించిన విషయం తెల్సిందే. ఇంకా ముఖ్య పాత్రలో అనసూయ - జగపతిబాబులు కనిపించారు. అయితే రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలక వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉందని అంతా భావించారు. ఆ పాత్ర విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారని అంతా భావించారు.
యాత్ర చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రపై దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చాడు. యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. వాటిని డ్రమెటిక్ గా - సినిమాటిక్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించామని పేర్కొన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఇద్దరు ముగ్గురు మహిళ ఎమ్మెల్యేలను స్ఫూర్తిగా తీసుకుని అనసూయ పాత్రను రూపొందించాను. చంద్రబాబు నాయుడు పాత్ర తాను అనుకున్న కథకు అవసరం లేదు. అందుకే ఆ పాత్రను చూపించలేదు. సినిమా కోసం 18 నెలలు కష్టపడ్డాను. స్క్రిప్ట్ వర్క్ చాలా డెప్త్ కు వెళ్లి చేశాను. ఇప్పుడు ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నానంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. వచ్చే వారంలో యాత్ర సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.