Begin typing your search above and press return to search.
తిరిగి తళుక్కుమన్న చంద్రబోస్ కలం..
By: Tupaki Desk | 24 Aug 2015 1:47 PM GMTఅర్ధవంతమైన సాహిత్యంతో ఆబాలగోపాలాన్ని సైతం అలరించే విధంగా అతి సామాన్యపదాలతో అత్యద్భుతమైన సాహిత్యాన్ని అందించడం తెలుగు సినిమా పాటల రచయితలకున్న లక్షణం. అటువంటి కవులలో రచయిత చంద్రబోస్ ఒకరు.
చంద్రబోస్ వాడే పదాలను పదే పదే పలకాలనిపిస్తుంది. ఆయన ఉపయోగించే అక్షరాలతో అరక్షణాలలో మనకు దగ్గరైపోతారు. పల్లవిలో ప్రాస వెల్లివిరుస్తుంది. చరణాలలోని భావాలను అర్ధంచేసుకున్నాక ఆయన చరాణాలకు మొక్కాలనిపిస్తుంది. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్న బోసు గారు ఇటీవల అవకాశాలు సన్నగిల్లడంతో వార్తలకు దూరమయ్యారు.
అయితే నిన్న విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియోలో 'తెలుగంటే.. ' అన్న పాటతో మరోసారి ఆ పాత చంద్రబోస్ ని తలపించి తమ అభిమానులను మురిపించారు. తెలుగుదనం గొప్పతనాన్ని తెలుపుతూ రచించిన ఈ పాట అనతికాలంలోనే అందరికీ చేరువవుతుందనడంతో సందేహం లేదు. వినకపోతే మీరూ ఓ చెవెయ్యండి మరి..