Begin typing your search above and press return to search.

జై రావణా.. గంటన్నరలో రాసేసా

By:  Tupaki Desk   |   17 Sep 2017 11:33 AM GMT
జై రావణా.. గంటన్నరలో రాసేసా
X
ప్రస్తుత రోజుల్లో సినిమాల్లో కథ ఎంత అవసరమో సంగీతం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఆ పాటల్లోని సాహిత్యం సినిమాకి చాలా బలాన్ని ఇస్తాయి. ఒక దర్శకుడు సినిమా కథని రెండు గంటల్లో చెప్పాలి కానీ పాటల రచయిత ఒక్క పాటలో సినిమా అర్దాన్ని చెప్పాలి. క్యారెక్టర్ ఎటువంటిది అనేదాన్ని తన అక్షరాలతో చూపించాలి. అలాగే సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆలోచింప జేసేలా ఆ సాహిత్యం ఉండాలి. అలాంటి పాటలలను రాసేవారిలో చంద్రబోస్ ఒకరు.

టాలీవుడ్ లో ఎంతో కాలం నుండి తన కలం బలంతో తెలుగు పాటలకు ఊపిరి పోస్తున్నారు. ప్రతి అక్షరంలో ఎన్నో వేల అర్దల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చంద్రబోస్ రీసెంట్ గా "జై లవకుశ" లో రాసిన "రావణా" అనే పాటను చాలా పాపులర్ అయ్యింది. అందరూ ఆ పాట విని చాలా మెచ్చుకున్నారు. చంద్రబోస్ కూడా ఆ పాటను రాసే సందర్భం తనకు ఇచ్చిన దర్శకుడికి - సంగీత దర్శకుడికి చాలా కృతజ్ఞత తెలిపాడు.

అయితే రావణుడు కోపంగా ఉంటాడు. అందరు బయపడిపోతారు అలాగే ఆ పాత్ర చాలా ఆకర్షణగా ఉంటుంది. దీంతో సినిమాలో కూడా ఆ పాత్ర అలానే ఉంటుందని దానికి అనుగుణంగా రాశానని చంద్రబోస్ చెప్పారు. ఇక పాట గంటన్నర లో ఆయన రాశరట. పాట వినగానే సినిమాలో మరో మూడు పాటలను రాసే ఛాన్స్ దర్శక నిర్మాతలు ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. పాట విన్న ఎన్టీఆర్ చాలా ప్రశంసించారు. దాదాపు 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడుతూ.. పాట గురించి చర్చించారని చెప్పారు.