Begin typing your search above and press return to search.

కళ్యాణ్‌ ఫ్యామిలీ నుండి వచ్చాడట

By:  Tupaki Desk   |   7 Sep 2017 3:31 AM GMT
కళ్యాణ్‌ ఫ్యామిలీ నుండి వచ్చాడట
X
తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో ఎక్కువగా చిన్న సినిమాల గురించి మాట్లాడం.. అలాగే బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలు రావలంటూ ఉపన్యాసాలు ఇవ్వడం.. ఇలా చాలామందే చేస్తుంటారు. వారిలో ప్రముఖంగా సి.కళ్యాణ్‌ పేరు వినిపిస్తుంది. మొన్నామధ్యన 'జ్యోతిలక్ష్మి' సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఈయన.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కీలక రోల్ పోషిస్తూ.. రకరకాల సినిమాలను పంపిణీ చేస్తూ బిజీగా ఉంటాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ఈయన ఫ్యామిలీ నుండి ఒక హీరో వస్తున్నాడు తెలుసా?

చాలామంది ప్రొడ్యూసర్లు తమ పిల్లలను.. తమ బంధువుల పిల్లలను హీరోలుగా పరిచయం చేస్తున్నట్లే కళ్యాణ్‌ కూడా తమ బంధువుల కొడుకును హీరోగా తీసుకొచ్చేశాడు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిపోయింది అంటున్నాడు. త్వరలోనే 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' అనే సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో చంద్రకాంత్ దత్తా అనే కుర్రాడు హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. తాడేపల్లిగుడెంకు చెందిన చంద్రకాంత్.. అమెరికాలోని లీ-స్ర్టాస్ బర్డ్ యునివర్సిటీలో యాక్టింగ్ కోర్సు చేస్తుండగా.. అక్కడే డైరక్షన్ కోర్సు చేస్తున్న గోవర్ధన్ పరిచయమయ్యాడట. ఇప్పుడు గోవర్ధన్ ప్రొడ్యూస్ చేస్తూ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో మనోడు హీరోగా ఎంట్రీ కొట్టాడు. అయితే మొత్తం సినిమా పూర్తయ్యాక.. అప్పుడు నాకు విషయం చెప్పాడు చంద్రకాంత్ అంటున్నారు సి.కళ్యాణ్‌. కాకపోతే సినిమా చూశాను.. భలే కొత్తగా ఉంది.. అమెరికాలో ఇలాంటి థ్రిల్లరు తీస్తారా అనిపించింది.. ఇది మన తెలుగు సినిమా అవ్వడం హ్యాపీగా ఉంది అన్నాడు. గత రాత్రి జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్లు చేశాడులే.

ఏదేమైనా కూడా.. బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరైనా స్టార్ కావొచ్చు కాని.. తరువాత వారి ఫ్యామిలీలోని వారు ఆ బ్యాగ్రౌండ్ తో ఏదో ఒకటి అవుతూనే ఉంటారు. బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి వచ్చినా.. ఇప్పుడు ఆయన వారసులు అనేకమంది ఉన్నారు. అలాగే తరువాత తరంలో రవితేజ ఉన్నాడు. ఆయన కొడుకు కూడా యాక్టింగ్ వైపే అడుగులు వేస్తున్నాడు. అది సంగతి.