Begin typing your search above and press return to search.
అబ్బాయ్ క్రెడిట్.. అబ్బే ఏలేటికే
By: Tupaki Desk | 20 July 2016 6:15 AM GMTవిభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మనమంతా చిత్రానికి సెన్సార్ కూడా పూర్తి చేసేశాడు. ఆగస్ట్ 5న విడుదలయ్యేందుకు ఈ మూవీ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మూవీతో తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో ఓ సినిమాలో కనిపించనున్నాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఈ కేరళ స్టార్ ని తెలుగులోకి తీసుకొస్తున్న క్రెడిట్ అంతా చంద్రశేఖర్ ఏలేటికే దక్కుతోంది.
1994 బాలకృష్ణ మూవీ గాండీవంలో ఓ పాటలో కనిపిస్తాడు మోహన్ లాల్. తిరిగి రెండు దశాబ్దాల తర్వాత ఇదే మోహన్ లాల్ ను తెలుగులో చేసేందుకు ఒప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. అలా బాబాయ్ సినిమా తర్వాత.. అబ్బాయ్ సినిమాతోనే తెలుగు తెరపై కనిపించాల్సి ఉంది. అయితే.. జూనియర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ పెద్ద కాన్వాస్ కావడంతో.. ఆ మూవీ రిలీజ్ లేట్ అవుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత మోహన్ లాల్ ఒప్పుకున్న మనమంతా మూవీ.. ముందు రిలీజ్ అయిపోతోంది.
అలా చంద్రశేఖర్ ఏలేటి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు మోహన్ లాల్. ఈ సీనియర్ నటుడిని తెలుగులోకి తీసుకొచ్చిన క్రెడిట్ జూనియర్ కు వస్తుందని అనుకుంటే.. ఇప్పుడు అంతా పట్టుకెళ్లిపోతున్నాడు ఏలేటి. ఎంతైనా ముందొచ్చిన సినిమాకి సీనియారిటీ ఎక్కువ కదా.