Begin typing your search above and press return to search.
టాలెంటెడ్ ఫిలిం మేకర్ తో నాని
By: Tupaki Desk | 20 Jun 2019 4:14 PM GMTచంద్రశేఖర్ యేలేటి సినిమాలు కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన సందర్భాలు లేవు కానీ ఆయన సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లభిస్తుంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రూపొందించడమే యేలేటి స్పెషాలిటీ. ఆయన చివరి సినిమా 'మనమంతా' కూడా మంచి రేటింగ్స్ తెచ్చుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడింది. అప్పటి నుంచి యేలేటి తన కొత్త సినిమా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకూ ఫైనల్ కాలేదు.
మెగా హీరో సాయి తేజ్ తో సినిమా చేస్తాడని మొదట్లో వార్తలు వచ్చాయి. అది కుదరకపోవడంతో సేమ్ స్క్రిప్ట్ నితిన్ దగ్గరకు వెళ్లిందని.. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అన్నారు. కానీ నితిన్ తో ప్రాజెక్ట్ వెనక్కు వెళ్ళింది. నితిన్ తో కుదరకపోవడంతో యేలేటి ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో శ్రియ శరణ్ ను ఒప్పించాడని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా సెట్ కాలేదని సమాచారం. అయితే న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం యేలేటికి లభించిందని లేటెస్ట్ టాక్.
ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ వారు సెట్ చేశారని.. మైత్రీ వారే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అంటున్నారు. నాని ప్రస్తుతం నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్' పూర్తి కాగానే యేలేటి సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా పట్టాలెక్కితే మాత్రం యేలేటి నిరీక్షణ ఫలించినట్టే.