Begin typing your search above and press return to search.
ఇలాంటి దర్శకుడు ఒక్కడే ఉంటాడు బాస్
By: Tupaki Desk | 6 Aug 2016 11:30 AM GMTబ్లాక్ బస్టర్ హిట్లిచ్చే రాజమౌళి లాంటోళ్లకే కాదు. కమర్షియల్ సక్సెస్ అందుకోని దర్శకులకు కూడా అభిమాన గణం ఉంటుంది. వాళ్లకూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో ప్రస్తుతం అలాంటి దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి పేరు ముందు చెప్పుకోవాలి. ఐతే దగ్గర్నుంచి సాహసం వరకూ విభిన్నమైన కథలతోనే ప్రయాణం సాగించాడు యేలేటి. ఐతే సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి సినిమాను తెలుగు తెర మీదే కాదు.. ఇండియన్ స్క్రీన్ మీదే ఊహించలేం. అంత ఆసక్తికరంగా.. అంత కొత్తగా ఉంటుంది ఆ సినిమా స్క్రీన్ ప్లే.
ఇక అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘ఒక్కడున్నాడు’.. ఒకే ఎయిర్ పోర్టులో రెండు గంటల కథను ఆహ్లాదంగా నడిపించిన ‘ప్రయాణం’.. నిధి వేట నేపథ్యంలో రసవత్తరంగా సాగే అడ్వంచరస్ మూవీ ‘సాహసం’.. ఇలా దేని ప్రత్యేకత దానిదే. ఈ సినిమాలు కమర్షియల్ గా ఎంత విజయం సాధించాయన్నది పక్కనపెడితే వైవిధ్యమైన సినిమాలు కోరుకునే ప్రేక్షకుల్ని మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలన్నింటినీ పరిశీలిస్తే ఒకదానికి ఇంకోదానికి అసలు సంబంధమే ఉండదు. అదే యేలేటి ప్రత్యేకత.
ఇక యేలేటి కొత్త సినిమా ‘మనమంతా’ కూడా అతడి గత సినిమాలకు భిన్నంగా ఉంటూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. తొలిసారి ఎమోషన్ల మీద ఫోకస్ పెడుతూ యేలేటి తీసిన ఈ సినిమా అతడి ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది. ప్రధానంగా థ్రిల్లర్లకు పేరుపడ్డ యేలేటి.. ఇలా మనిషి గురించి.. విలువల గురించి.. సినిమా తీసి మెప్పించగలడా అని చాలామంది సందేహించారు. కానీ తన కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇది అని చెప్పిన యేలేటి.. ఆ సవాలును బాగానే ఛేదించాడు.
సినిమా చూసిన వాళ్లంతా ఆఖరుకు వచ్చేసరికి ఒక రకమైన ఉద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకునేలా హార్ట్ టచింగ్ గా సినిమాను తీర్చిదిద్దాడు యేలేటి. దర్శకుడిగా అతడేంటో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. యేలేటి గత సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి మంచి సినిమాను ఆదరించి.. యేలేటి లాంటి గొప్ప దర్శకుడికి మైలేజ్ ఇవ్వాలి.. అతను మరిన్ని వైవిధ్యమైన సినిమాలు అందించేలా ప్రోత్సహించాలి. అది కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల బాధ్యత.