Begin typing your search above and press return to search.

మల్టీ స్టోరీతో ఇతనన్నా మెప్పించగలడా?

By:  Tupaki Desk   |   13 May 2016 5:16 AM GMT
మల్టీ స్టోరీతో ఇతనన్నా మెప్పించగలడా?
X
24రీళ్లలో, రెండున్నర గంటల నిడివిలో ఒక స్టోరీని చెప్పడానికి నానా ఇబ్బందులు పడుతున్న సమయాలు కోకొల్లలు. అయితే అదే నిడివిలో కొన్ని సెపరేట్ ట్రాక్స్ తీసుకుని వాటిని ఒకే థ్రెడ్ లో కలుపుతూ సాగిపోయే ప్రక్రియని మల్టీ స్టోరీ టేకింగ్ అంటారు. ఈ కాన్సెప్ట్ లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చినా అవి ఆశించిన మేరకు విజయం సాధించలేదు.

క్రిష్ తెరకెక్కించిన వేదం ఇలానే ఐదు డిఫరెంట్ స్టోరీలైన్ ల మధ్య నడుస్తుంది. ప్రవీణ్ సత్తారు చందమామ కధలు సినిమా కూడా అంతే. అప్పట్లో నవదీప్ నటించిన ఓం శాంతి బొమ్మ కూడా ఇదే నేపధ్యం. అయితే ఈ సినిమాలేవీ ప్రేక్షకుడిని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్ళలేకపోయాయి. సాగతీత సినిమా వీక్షకుడు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలే ఎక్కువ.

అయితే మరోసారి ఈ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మక దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మనముందుకు రానున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ తో మనమంతా అనే సినిమాను తీస్తున్న దర్శకుడు ఈ సినిమాలో నాలుగు విభిన్న స్టోరీలు వున్నట్టు తెలిపాడు. చూద్దాం మన యేలేటి అయినా మెప్పిస్తాడో లేదో..