Begin typing your search above and press return to search.

హాట్ యాంకర్ కి కలసి రాలేదా?

By:  Tupaki Desk   |   25 Sep 2015 11:30 AM GMT
హాట్ యాంకర్ కి కలసి రాలేదా?
X
బుల్లితెరపై బాగానే సందడి చేస్తున్న యాంకర్ శ్రీముఖి. జులాయిలో అల్లు అర్జున్ చెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో ముగ్గురమ్మాయిల్లో ఒకరిగా మెరిసింది. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా చేసిన సినిమా చంద్రిక. హారర్ కామెడీ అని డైరెక్టర్ చెప్పినా.. ఇది ఏ జోనర్ సినిమానో తేల్చుకోలేకపోతున్నారు ప్రేక్షకులు.

చంద్రముఖిని చూసి ఇన్ స్పైర్ అయ్యి రాసుకున్న కథ అని ఈజీగానే అర్ధవుతున్నా.. అందులోనూ క్లారిటీ లేకపోవడం ఈ మూవీకి పెద్ద డ్రా బ్యాక్. సాధారణంగా హారర్ మూవీల్లో ఓ ఐదారు షాకింగ్ సీన్స్ అన్నా కొత్తగా పడుతుంటాయి. కనీసం ఆ ఫీల్ కూడా మిగల్చలేకపోయింది చంద్రిక. కామ్నాజెఠ్మలానీ దెయ్యం రూపంలో శ్రీముఖిలోకి ఎంటర్ అయ్యే సీన్ లు కూడా సోసోగానే ఉన్నాయి. కామెడీ కూడా పండకపోవడం చంద్రికకు పెద్ద మైనస్ గానే చెప్పాలి.

నెక్ట్స్ సీన్ ఏంటో ముందే అర్ధమవుతుండడంతో.. చూస్తున్నంతసేపూ సినిమా ఎప్పుడు అయిపోతుందా అనిపించక తప్పదు. ఈ మూవీకి సంబంధించి పాజిటివ్ ఏదన్నా ఉందా అంటే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని చెప్పుకోవాలి. గుణ్వంత్ ఇచ్చిన బీజీఎం.. ఒక్కటే రిలీఫ్. లీడ్ హీరోయిన్ గా చేసినా.. శ్రీముఖికి ఇంకా టైం కలిసిరాలేదనే చెప్పాలి. చంద్రికపై ఈ బుల్లితెర హాట్ యాంకర్ పెట్టుకున్న ఆశలు.. చంద్రికతో నెరవేరే అవకాశం ఏమాత్రం లేదు.