Begin typing your search above and press return to search.

బాల‌య్య‌ను బావా అంటూ ఆట‌ప‌ట్టించేది త‌నేనా?

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:50 PM GMT
బాల‌య్య‌ను బావా అంటూ ఆట‌ప‌ట్టించేది త‌నేనా?
X
స్టార్ హీరోల సినిమాల్లో గ‌త కొంత కాలంగా స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ కామ‌న్ గా మారిపోయింది. సీరియ‌స్ గా సాగుతున్న క‌థ‌, క‌థ‌నాల‌కు కాస్త రిలీఫ్ ని ఐట‌మ్ సాంగ్ లు అందించ‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల్లో మ‌రింత జోష్ ని నింపుతుంటాయి. దీంతో చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల్లో ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ అనివార్యంగా మారింది. అయితే ఈ ఫార్ములాని గ‌త కొంత కాలంగా ప‌క్క‌న పెట్టేస్తూ త‌న‌దైన మార్కు సీరియ‌స్ యాక్ష‌న్ సినిమాల‌తో దూసుకుపోతున్నా బాల‌కృష్ణ తాజా మూవీ కోసం ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ ని ప్లాన్ చేశారు.

`అఖండ‌` మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన బాలకృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో `వీర సింహారెడ్డి`గా రాబోతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీని సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. టాప్ టు బాట‌మ్ బ్లాక్ డ్రెస్ కోడ్ తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బాల‌య్య క‌నిపిస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ హంట్ పేరుతో విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఇదిలా వుంటే రీసెంట్ గా ప్ర‌మోష‌న్స్ ని లిరిక‌ల్ వీడియోల‌తో మొద‌లు పెట్టిన మేక‌ర్స్ ఫ‌స్ట్ సింగిల్ గా `జై బాల‌య్య‌..`. సెకండ్ సాంగ్ గా `సుగుణ సుంద‌రి` పాట‌ల‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోల‌ని రిలీజ్ చేశారు. డిసెంబ‌ర్ 24న శనివారం మ‌ధ్యాహ్నం 3:19 నిమిషాల‌కు `మా బావ మ‌నోబావాలు` అంటూ స్పెష‌ల్ సాంగ్ ని వ‌ద‌ల బోతున్నారు. బుధ‌వారం ఉద‌యం ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.

మ‌రి ఈ స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ లో `మా బావ‌.. డాన్ బావ‌..` అంటూ బాల‌య్య‌తో అల్ల‌రి చేసే ఆ హాటీ ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ లో అస్టేలియాలో సెటిలైన ఆట‌మ్ బాంబ్ చంద్రికా ర‌వి న‌టించింది. `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` మూవీలో త‌న హాట్ హాట్ అందాల‌తో ర‌చ్చ చేసిన చంద్రికా ర‌వి ఈ పాట‌లోనూ అదే స్థాయిలో గ్లామ‌ర్ షో చేస్తూ బాల‌య్య‌తో స‌య్యాట ఆడ‌నుంద‌ట‌.

శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలవ‌నుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. న్యూ ఇయ‌ర్ ఎండింగ్ కి వారం ముందు విడుద‌ల కాబోతున్న ఈ సాంగ్ ఓ రేంజ్ లో న్యూ ఇయ‌ర్ కి రీసైండ్ ఇవ్వ‌డం గ్యారంటీ. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి రిషీ పంజాబీ సినిమాటోగ్రఫీని, న‌వీన్ నూలి ఎడిటింగ్ ని అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.