Begin typing your search above and press return to search.

గాడ్‌ఫాద‌ర్‌లో మార్పులు చేర్పులు సర్ప్రైజ్‌లు

By:  Tupaki Desk   |   5 Oct 2022 3:22 AM GMT
గాడ్‌ఫాద‌ర్‌లో మార్పులు చేర్పులు సర్ప్రైజ్‌లు
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం గాడ్‌ఫాద‌ర్ ఇంకొన్ని గంట‌ల్లోనే థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. ఆచార్య లాంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత చిరు నుంచి వ‌స్తున్న చిత్ర‌మిది. దీనిపై ఆయ‌న చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

ఆచార్య ప్ర‌భావానికి తోడు మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్‌కు రీమేక్ కావ‌డం వ‌ల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బ‌జ్ రాలేదు. విడుద‌ల ముంగిట ప‌రిస్థితి మెరుగుప‌డింది. చిరుతో పాటు ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా, నిర్మాత‌లు సినిమా రిజ‌ల్ట్ విష‌యంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

లూసిఫ‌ర్ చూసినా ఇబ్బంది లేద‌ని, వాళ్ల‌ను కూడా సంతృప్తి ప‌రుస్తామ‌ని ధీమాగా చెప్పాడు మోహ‌న్ రాజా. ఈ ధీమాకు కార‌ణం సినిమాలో చేసిన మార్పులు చేర్పులే అని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఒరిజిన‌ల్లో మోహ‌న్ లాల్ సినిమా మొత్తంలో 55 నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తాడ‌ని, కానీ చిరు ఇక్క‌డ 2 గంట‌ల పాటు తెర‌పై క‌నిపించేలా మార్పులు చేశామ‌ని మోహ‌న్ రాజా చెప్ప‌డం విశేషం.

అంతే కాక సినిమాలో కొత్త క్యారెక్ట‌ర్లు ప‌ది దాకా ఉంటాయ‌ని.. వాటితో ముడిప‌డ్డ స‌న్నివేశాలు కూడా కీల‌కంగా ఉంటాయ‌ని మోహ‌న్ రాజా చెబుతున్నాడు. మూల క‌థ‌ను మాత్రం అలాగే ఉంచి స్క్రీన్ ప్లే మార్చామ‌ని, కొత్త క్యారెక్ట‌ర్లు, స‌న్నివేశాలు జోడించామ‌ని మోహ‌న్ రాజా తెలిపాడు.

ఇంట‌ర్వెల్ బ్లాక్‌కు థియేట‌ర్లు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయ‌ని, చిరు కేవ‌లం క‌ళ్ల‌తో మూడు స‌న్నివేశాల‌ను గొప్ప‌గా పండించాడ‌ని మోహ‌న్ రాజా ఊరిస్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒక‌రైన ఎన్వీ ప్ర‌సాద్ గాడ్‌ఫాద‌ర్‌లోని ఒక స‌ర్ప్రైజ్ గురించి ఆస‌క్తిక‌ర విశేషాలు చెప్పాడు. ఒరిజిన‌ల్లో టొవినో థామ‌స్ చేసిన పాత్ర‌ను ఇక్క‌డ ఎవ‌రు చేశార‌ని అడిగితే.. దానికి సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా సినిమాలో ఒక పాత్ర‌కు సంబంధించి స‌ర్ప్రైజ్ ఉంద‌ని, దాని గురించి చెప్ప‌మ‌ని త‌మ టీం సూచించిన‌ప్ప‌టికీ.. దాన్ని స‌స్పెన్సుగా దాచాల‌ని తాను భావిస్తున్నాన‌ని, రేపు తెర‌పై చూసి దాన్ని బ్ర‌హ్మాండంగా ఎంజాయ్ చేస్తార‌ని ఎన్వీ ప్ర‌సాద్ చెప్ప‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.