Begin typing your search above and press return to search.
సాయితేజ్ లో ఛేంజ్? కారణం ఎవరబ్బా!
By: Tupaki Desk | 13 Jun 2022 12:30 AM GMTమెగా మేనల్లుడు సాయితేజ్ కెరీర్ ఇంకా పుంజుకోలేదు. మామల వారసత్వంతో ఎంట్రీ అయితే ఇచ్చాడు గానీ ఇంకా మామల అంచనాల్ని అందులేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు గానీ..పలించడం లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథలపై పడ్డాడు. కానీ అవి సాయిని అవి పెద్ద స్టార్ ని చేయలేకపోయాయి. నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్న తరహాలో నే ఇన్నాళ్లు లవ్ స్టోరీల్లో నటించి..నలుగురి పంథాలోనే నడిచాడు.
ఈ మధ్యనే కాస్త రూట్ మార్చినట్లు కనిపించాడు. `రిపబ్లిక్` అనే సినిమా చేసి రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవేర్ నెస్ తీసుకొచ్చే సందేశాత్మక సినిమా చేసాడు. కానీ పనవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ సమయంలో సాయికి పెద్ద యాక్సిడెంట్ అవ్వడం..ఇటీవల కోలుకోవడం సంగతి తెలిసిందే. కొన్ని నెలలు పాటు ఇంట్లోనే గడిపాడు.
యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ప్రకటించలేదు. ఇటీవలే తన 15వ చిత్రంగా `రుద్రవనం` అనే ఓ సినిమా ఒకే చేసినట్లు తెలుస్తోంది. దీనికి సుకుమార్ స్వయంగా స్ర్కీన్ ప్లే అందించడం.. అతని శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడం జరుగుతుంది. అయితే రుద్రవనం సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ.
ఓ గ్రామంలో జరిగిన హత్యలు..ఆత్మహత్యలు చుట్టూ తిరిగే కథ. వాటి చిక్కుముడి విప్పే పాత్రలో సాయితేజ్ కనిపించనున్నాడు. ఆ రకంగా సాయికి ఇది పాత్ర పరంగా కొత్తతే. అతనికి డిఫరెంట్ జానర్ సినిమా కూడా అవుతుంది. కానీ ఇవన్నీ కేవలం సాయికి మాత్రమే. ప్రేక్షకులకు కాదు. ఇలాంటి జానర్ చిత్రాలు ఆడియన్స్ కి కొత్తేం కాదు.
చాలా రకాల స్ర్కీన్ ప్లే తో ఆ జానర్ కథల్ని ఆస్వాదించారు. మరి సాయి కెరీర్ కి ఇది తొలి అవకాశం కాబట్టి ఎలా మెప్పిస్తాడు? అన్నది చూద్దాం. అయితే లవర్ బోయ్ గా మెప్పించిన సాయితేజ్ ఇప్పుడిలా టర్న్ తీసుకోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఉన్నట్లుండి స్ర్కిప్ట్ ల పట్ల ఈ మార్పులు ఎలా వచ్చిందన్నది అర్ధం కాని ప్రశ్న.
దీంతో సాయిని అంతగా వాష్ చేసింది? ఎరబ్బా అంటే? ఓ సందేహం తెరపైకి వస్తుంది. సాయితేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకునే సమయంలో చాలా మంది దర్శకులు..హీరోల్ని ఆయన్ని ఇంటికెళ్లి పరామర్శించారు. కొంత మంది దర్శకులు అతినితో గంటల తరబడి సమయం గడిపారు. ఈ సమయంలో మాటల మధ్యలో ఎన్నో అంశాలు చర్చకొచ్చాయి.
వాటిలో ప్రధానంగా సినిమా అనేది కచ్చితంగా ఉంటుంది కాబట్టి...ఆ టైంపాస్ మీట్ కొంత వరకూ సాయిలో మార్పుకి ఛాన్స్ గా భావించొచ్చు అని తెలుస్తుంది. ఏదైనా మార్పు మంచిదే. తమ్ముడు వైష్ణవ్ తేజ్ లో ఆ క్లారిటీ ముందే కనిపిస్తుంది. అందుకే `ఉప్పెన్` తో సక్సెస్ అయ్యాడు. `కొండ పొలం` లాంటి డిఫరెంట్ జానర్ సినిమా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.