Begin typing your search above and press return to search.
రీమేక్ స్క్రిప్ట్ ను ఒరిజినల్ సబ్జెక్ట్ అనుకునేలా మార్పులు చేసారట..!
By: Tupaki Desk | 11 Nov 2021 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ''భోళా శంకర్''. గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ ని లాంఛ్ చేశారు. నవంబర్ 15 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎక్కువ శాతం చిత్రీకరణ స్పెషల్ సెట్స్ లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందబోతోంది.
ఇది తమిళ 'వేదాళమ్' చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ స్క్రిప్ట్ మాదిరిగానే ఈ సినిమాపై దర్శకుడు మెహర్ రమేష్ వర్క్ చేశారని తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్ ని మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేర్పులు చేసారట. దీని కోసం మెహర్ దాదాపుగా ఏడాదిన్నర పాటు కష్టపడ్డారట.
'శక్తి' 'షాడో' వంటి రెండు భారీ డిజాస్టర్స్ అందుకున్న మెహర్ రమేష్ కు.. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మెగా అవకాశం కావడంతో ''భోళాశంకర్'' విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారట. సీనియర్ రచయిత సత్యానంద్ సలహాలతో ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశారని తెలుస్తోంది. ఇది రీమేక్ సబ్జెక్ట్ అని కాకుండా.. కొత్త కథ అనుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్.. హీరోయిన్ గా తమన్నా భాటియా నటించనుంది. రఘుబాబు - రావు రమేశ్ - మురళీ శర్మ - రవిశంకర్ - వెన్నెల కిశోర్ - తులసి - ప్రగతి - శ్రీముఖి - బిత్తిరి సత్తి - సత్య - గెటప్ శ్రీను - రష్మీ గౌతమ్ - ఉత్తేజ్ - ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. డూడ్లే సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటారు. రామ్ లక్ష్మణ్ - దిలీప్ సుబ్బరాయన్ ఫైట్ మాస్టర్స్ గా.. శేఖర్ డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహటించనున్నారు.