Begin typing your search above and press return to search.
పుష్ప 2 కోసం ప్లాన్ ఛేంజ్ చేస్తున్నారా?
By: Tupaki Desk | 20 Jun 2022 1:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ మూవీ 'పుష్ప : ది రైజ్'. స్టార్ డైరెక్టర్ కుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ ఈ మూవీ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ లో ఈ మూవీ హాట్ టాపిక గా మారింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఉత్తరాదిలో ఈ మూవీ రూ. 100 కోట్ల కు మించి వసూళ్లని రాబట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ మూవీలోని ప్రతీ సాంగ్, ప్రతీ డైలాగ్.. బన్నీ మేనరిజమ్ నేషనల్ వైడ్ గా వైరల్ గా మారాయి. కంటెంట్ విషయంలోనే కాకుండా ఈ మూవీ పబ్లిసిటీ పరంగానూ దేశ వ్యాప్తంగా తగ్గేదేలే అని పిరూపించి ఆశ్చర్యపరిచింది. ఓ సినిమాకు ఈ స్థాయిలో పబ్లిసిటీని చేయోచ్చా? .. ఇంతగా వైరల్ గా మార్చోచ్చా అని అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' ని మరిన్ని ప్రత్యేకతలతో మరింత స్పెషల్ గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు సుకుమార్ గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ పై కుస్తీ పడుతున్నారు.
ఇక ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని, దేశ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని సంచలనాలని సృష్టించిన 'కేజీఎఫ్ 2' తరువాత బన్నీ, సుకుమార్ ల ప్లాన్ కంప్లీట్ గా మారిపోయింది. బడ్జెట్ నుంచి సినిమాలోని కీలక ఘట్టాల వరకు అన్నింటిని భారీ స్థాయిలో మార్చేశారు. ఈ మూవీ కోసం దాదాపు రూ. 400 కోట్లు కేటాయించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చర్కర్లు కొడుతోంది. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఈ మూవీ షూటింగ్ కోసం చిత్తూరు, కర్నూలు పరిసరాల్లో చిత్ర బృందం లొకేషన్స్ ని వెతుకుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని, 'కేజీఎఫ్ 2' తరువాత దర్శకుడు సుకుమార్, హీరో బన్నీ ప్లాన్ మొత్తం మార్చేశారని, ఈ మూవీ షూటింగ్ ని అత్యధిక భాగం విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట.
మరి ముఖ్యంగా సౌత్ ఏషియాలో, హంగాకాంగ్ లో ఈ మూవీ షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా నల్లమలలో షూటింగ్ చేయడానికి పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో ఆ సీన్ లని బ్యాంకాక్ ఫారెస్ట్ లో చేయాలని, పలు కీలక ఘట్టాలని చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.
అంతే కాకుండా బన్నీని పార్ట్ 2 లో గంధపు చెక్కల స్లగ్లింగ్ కి కింగ్ పిన్ గా మార్చి ఇంటర్నేషనల్ డాన్ గా చూపించబోతున్నారట. అందులో భాగంగానే సుకుమార్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ కీలక సన్నివేశాలని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.