Begin typing your search above and press return to search.
భారీ ఛేజ్ కి గురుడు రెడీ!!
By: Tupaki Desk | 20 Oct 2018 6:35 AM GMTభారతదేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా `సాహో` పాపులరవుతున్న సంగతి తెలిసిందే. టాప్ క్లాస్ హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో సాహో చేరింది. బాహుబలి సిరీస్ తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రభాస్ చాలానే రిస్కులు చేస్తున్నాడు.
ఇదివరకూ దుబాయ్ షెడ్యూల్లో హైరిస్క్ యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. దుబాయ్ బుర్జ్ పార్క్ - ఖలీఫా ఏరియా సహా ఓ భారీ వంతెనపై ఛేజ్ - యాక్షన్ సీన్స్ ని కెన్నీ బేట్స్ సారథ్యంలో తెరకెక్కించారు. మరోసారి అంతే భారీ యాక్షన్ సీన్స్ ని కెన్నీబేట్స్ సారథ్యంలో తెరకెక్కించేందుకు యువిక్రియేషన్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోందిట. ఈసారి రొమానియా వెళుతున్నారు. అక్కడ భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ ఛేజ్ సీన్ సినిమాకే హైలైట్ గా ఉండేలా తీర్చిదిద్దనున్నారట. ప్రభాస్ - నీల్ నితిన్ లు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలిసింది.
కెన్నీ బేట్స్ అంటే ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి టిఫికల్ యాక్షన్ బేస్డ్ సినిమాకి పని చేసిన అనుభవజ్ఞుడు. అందుకే సాహో చిత్రంలో యాక్షన్ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం ఈ యాక్షన్ సీన్స్ కోసమే కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాదాపు 250కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టు ప్రేరిలీజ్ బిజినెస్ లోనూ హైప్ నెలకొంది. ఇప్పటికే హిందీ రిలీజ్ హక్కుల్ని టీసీరిస్ ఛేజిక్కించుకుంది. పెరుగుతున్న హైప్ దృష్ట్యా ఇతర ఏరియాల హక్కులకు భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.