Begin typing your search above and press return to search.

ఛానల్స్ - యాంకర్స్ - హీరోస్ - డైరెక్టర్స్.. అంతా చీప్ పబ్లిసిటీ కోసమేనా..?

By:  Tupaki Desk   |   5 May 2022 10:30 AM GMT
ఛానల్స్ - యాంకర్స్ - హీరోస్ - డైరెక్టర్స్.. అంతా చీప్ పబ్లిసిటీ కోసమేనా..?
X
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏది చేసినా పబ్లిసిటీ కోసమే అన్నట్లుగా మారిపోయింది. TRP రేటింగ్స్ కోసం టీవీ ఛానల్స్.. వ్యూస్ కోసం సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్.. క్లిక్స్ కోసం డిజిటల్ మీడియా.. సినిమా కోసం చీప్ ట్రిక్స్ అండ్ చీప్ పబ్లిసిటీ స్టంట్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వ్యవహారమే నడుస్తోంది.

అదేవిధంగా ప్రపంచంలో అందరూ 'ఇగో' అనే రోగంతో అల్లాడిపోతున్నారు. ప్రతీ వ్యక్తికి ఈగో అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే అన్ని రకాల మానసిక రోగాలకు అసలు కారణం అవుతోంది. ఒకప్పుడు ఈగలు తోలుకున్న సైకలాజికల్ డాక్టర్స్.. ఇప్పుడు కోట్లకు పరుగులు తీస్తున్నారంటేనే ఈ జబ్బుతో బాధ పడుతున్నవారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈరోజు అన్ని అనార్థాలకు ఈ పబ్లిసిటీ పిచ్చి - ఈగోలు - సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవే కారణమవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. గత నాలుగు రోజులుగా ఒక న్యూస్ ఛానల్ మరియు యువ హీరోకి మధ్య వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇందులో తప్పొప్పుల మీద జరుగుతున్న డిస్కషన్ ఇద్దరికీ ఫుల్ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

ఈ ఇష్యూలో కొందరు యాంకర్ కు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు హీరోకు మద్దతుగా నిలుస్తున్నారు. సదరు ఛానల్ కు ఈ మధ్య రేటింగ్స్ బాగా పడిపోయాయని.. అందుకే టీఆర్పీ కోసం ఇలాంటి రచ్చ చేస్తోందని ఓ వర్గం అభిప్రాయ పడుతోంది. ఒక పార్టీకే కొమ్ము కాస్తూ.. ఎవరిని పడితే వాళ్ళను టార్గెట్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేయడం.. వాళ్ళ మీద 30 మినిట్స్ డిబేట్స్ పెట్టి పరువు తీయాలనే విధంగా ప్రచారం చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ వివాదంలో ఛానల్ తప్పు ఉందా? హీరో తప్పు ఉందా? అనేది అక్కడ ఇరువైపులా జరిగిన మాటల యుద్ధాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు. మనిషి అన్న తర్వాత కోపం రావడం సహజం. ఉప్పూ కారం తింటున్నప్పుడు కోపతాపాలు వస్తాయి. అన్ని ఎమోషన్స్ మాదిరిగానే అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. కొందరు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే.. మరికొందరు వెంటనే చూపించి, తర్వాత పశ్చాత్తాప పడుతుంటారు.

లైవ్ డిబేట్ లో ఒక వ్యక్తిని పట్టుకొని డిప్రెస్డ్ మ్యాన్ - పాగల్ అని పిలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అతను అలాంటి వ్యక్తి అని తెలిసినప్పుడు.. ఫోన్ చేసి పిలిచి మరీ డిబేట్ కు ఎందుకు పిలవాలి? ఎందుకు అవమానించాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. మేం పిలిచాం కాబట్టి ఏమన్నా పడాలి.. మేం చెప్పిందే వినాలి.. అదే వేదం అనడం ఎంత వరకూ సమంజసం అనే చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పటి జనరేషన్ వాళ్ళు.. ముఖ్యంగా యూత్ ఇప్పుడు వరల్డ్ మొత్తానికి కనెక్ట్ అవుతున్నారు గానీ... కేవలంహైదరాబాద్ కు తెలుగు కల్చర్ కు మాత్రమే కాదనేది ఆలోచన చేయాలి కదా అని ఓ వర్గం అభిప్రాయ పడుతున్నారు. అందులోనూ మీడియాలో అభ్యంతరకరమైన పదం వాడినందుకు హీరో తన తప్పు తెలుసుకొని.. సారీ కూడా చెప్పాడు.

అయితే సదరు న్యూస్ ఛానల్ మాత్రం అదే 'F' పదాన్ని టైటిల్ గా పెట్టి స్పెషల్ ప్రోగ్రామ్ ప్రచారం చేసింది. ఆ పదాన్ని అతను యూజ్ చేసింది ఒక్కసారైతే.. అదే బూతు పదాన్ని టైటిల్ గా ఎలా పెట్టారు? పదే పదే ఆ బూతుని ప్రస్తావిస్తూ జనాల్లోకి బలంగా తీసుకెళ్లడం ఎంత వరకూ కరెక్ట్? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇదే ఛానల్ లో గతంలో ఓ డిబేట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొబైల్ చూస్తూ ఉంటే 'ఏం చూస్తున్నారు?' అని ప్రముఖ యాంకర్ ప్రశ్నిస్తే.. 'పోర్న్ చూస్తున్నాను' అని ఓపెన్ గా సమాధానం చెప్పారు. అలానే ఆర్జీవీ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ ఓ మహిళ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే.. ''శృంగార తార మియా మాల్కోవా కన్నా ఆమె అందంగా ఉంది.. ఆమెతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా చేస్తా'' అని అదే ప్రముఖ యాంకర్ ముందు వర్మ అన్నారు.

ఒక మహిళా విద్యావేత్త గురించి లైవ్ డిబేట్ లో ఆర్జీవీ అలాంటి కామెంట్స్ చేసినప్పుడు.. దాన్ని జోవియల్ గా తీసుకున్న ఆ ప్రముఖ యాంకర్ కు 'సభ్య సమాజం.. యావత్ మహిళా లోకం' గుర్తుకు రాలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆ యాంకర్ సమక్షంలో ఆర్జీవీ వాడిన 'పోర్న్' 'సెక్స్' అనే పదాల కంటే.. ఇప్పుడు ఈ హీరో ఉపయోగించిన పదం.. అదే ఛానల్ లో టైటిల్ గా పట్టుకోడానికి అభ్యంతరం లేని పదం పెద్దది కాదని అంటున్నారు.

ఎందుకంటే సమాజంలో ప్రతీ గ్రామంలో ఇప్పుడు ఆ పదాన్ని వాడుతున్నారు. ఇంగ్లీషులో ఉన్న పదం తెలుగులోకి అనువధిస్తే చిన్న పదం అవుతుందనేది గుర్తుంచుకోవాలని అంటున్నారు. సోషల్ మీడియాలో చాట్ చేస్తున్నప్పుడు హీరోహీరోయిన్లు.. యాంకర్లు మరియు ఇతర సెలబ్రిటీలు ఇంతకంటే పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు కదా అని అంటున్నారు.

ఈ సందర్భంగా ఇంత పెద్ద రచ్చలో భాగమైన ఫీమేల్ యాంకర్ సమక్షంలో గతంలో ఒక షోలో 'F**' పదాన్ని వాడిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమా టైంలో ఈ యాంకర్ హోస్ట్ చేసిన ప్రోగ్రామ్ కి మరో లేడీ యాంకర్ గెస్టుగా వచ్చింది. చర్చ సందర్భంగా గెస్టుగా వచ్చిన యాంకర్.. 'F***ing' అంటూ బూతులు మాట్లాడింది.

అయితే అప్పుడు మాత్రం హోస్ట్ గా ఉన్న యాంకర్‌ కు అది బూతులా అనిపించకపోగా.. 'F' పదం వాడిన యాంకర్ ను ఫైటర్ అంటూ తెగ పొగిడేసింది. ఇప్పుడు హీరో విషయంలో మాత్రం 'జెండర్ కార్డ్' వాడుతూ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదైతేనేం ఎలా అయితేనేం.. ఈ వివాదం ఇద్దరికీ కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. ముఖానికి రంగు వేసుకునే సెలబ్రిటీలు.. ఇప్పుడు ఇలాంటి చీప్ పబ్లిసిటీకి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.