Begin typing your search above and press return to search.

క్యారెక్టర్ ఆర్టిస్టుల పని బాగుంది

By:  Tupaki Desk   |   4 Aug 2018 5:30 PM GMT
క్యారెక్టర్ ఆర్టిస్టుల పని బాగుంది
X
హీరోలకు సినిమా ఫలితాన్ని బట్టో లేక టైం షెడ్యూల్ ని బట్టో గ్యాప్ రావొచ్చేమో కానీ ఒక్కసారి పేరొచ్చాక క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంటికి వెళ్లే తీరిక కూడా ఉండదు. అందులోనూ నటీనటుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు విలన్ గా రావు గోపాల్ రావు ఆయన అసిస్టెంట్ గా అల్లు రామలింగయ్య సపోర్టింగ్ రోల్స్ లో రంగనాథ్-నూతన్ ప్రసాద్ ఎన్ని సినిమాల్లో కనిపించినా జనం విసుగు లేకుండా చూసేవారు. అప్పటి ట్రెండ్ వేరు. కాలం మారింది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయటం అంత ఈజీ టాస్క్ కాదనే విషయం దర్శక నిర్మాతలకు అర్థమైపోయింది. కథల్లో ఎంత వైవిధ్యం చూపించినా ఆర్టిస్టులను మాత్రం పదే పదే ఒకరినే పెట్టుకోవాల్సి వస్తోంది. దాని మూలంగానే ప్రతి గురు శుక్రవారాల్లో ఎన్ని సినిమాలు విడుదలైనా వాటిలో హీరో హీరోయిన్ లు మారుతున్నారు తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్లు మాత్రం ఇంచుమించు ఒకే పాత్రలో రిపీట్ అవుతూనే ఉన్నారు.

ఈ బ్యాచ్ లో ముఖ్యంగా మురళీశర్మ-రావు రమేష్-వెన్నెల కిషోర్ లాంటివాళ్లను చెప్పుకోవచ్చు. చిన్న లేదు పెద్ద లేదు అన్ని సినిమాల్లోనూ వీళ్లకు వేషం లేనిదే కథ ముందుకు నడిచేలా లేదు. అత్యధిక సినిమాల్లో హీరో హీరోయిన్లకు తండ్రిగా నటించిన ఆర్టిస్టుగా మురళిశర్మ ఏదో ఏదో ఒక బుక్కులో రికార్డు సాధించేలా ఉన్నాడు. తమిళ నటుడు జయప్రకాశ్ కూడా పోటీ పడుతున్నాడు. రావు రమేష్ కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నా వారానికో సినిమా గ్యారెంటీ. ఇక వెన్నెల కిషోర్ గురించి చెప్పాల్సింది ఏమి లేదు. ఆఖరికి గెడ్డం గీసుకోవడానికి కూడా టైం లేక ఆ మధ్య రన్నింగ్ కారులోనే షేవింగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టేసి ఎంత బిజీనో చెప్పకనే చెప్పాడు. నిన్న విడుదలైన చిలసౌ-గూఢచారిలో ఇతనివే కీలక పాత్రలు. సో స్టార్ల డిమాండ్ ఎంత ఉన్నా వీళ్ళు చాలా స్పెషల్ గా నిలుస్తూ అన్నిట్లో మిమ్మల్నే చూడాలా అనే ప్రేక్షకులకు ఎస్ అనే సమాధానమే ఇస్తున్నారు. ఆప్ష