Begin typing your search above and press return to search.
సినిమా చేశాక ఆ పాత్ర పిచ్చలోనే ఉండిపోతుందట!
By: Tupaki Desk | 20 Oct 2019 5:39 AM GMTఒక సినిమా చూసేయటం.. బాగుంది.. బాగోలేదని జడ్జిమెంట్ ఇచ్చేయటం చాలామంది చేస్తారు. ఆరేడు నెలల నుంచి రెండేళ్ల వరకూ తీసే సినిమాను.. జస్ట్ రెండున్నర గంటల్లో విషయాన్ని తేల్చేయటం చాలామంది చేసేదే. ప్రేక్షకుడి సంగతి సరే.. మరి.. సినిమాలో నటించిన వారి పరిస్థితి ఏమిటి? ఒక సినిమా చేశాక.. సదరు సినిమాలో వారు చేసిన పాత్ర ప్రభావం వారి మీద ఎంత ఉంటుందన్న సందేహం పలువురికి కలుగుతుంటుంది.
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా విలక్షణ నటి తాప్సీ విషయంలో మాత్రం అందరిలా ఉండదనే చెప్పాలి. తాను నటించిన పాత్రలో జీవించే ఆమె.. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఆ పాత్రలో నుంచి బయటకు రావటానికి ఆమె పడే తిప్పలు అన్ని ఇన్ని కావు.
వినేందుకు విచిత్రంగా అనిపించినా.. తాను పడే తిప్పల గురించి తాజాగా ఆమె చెప్పిన విషయాలు వింటే.. ఒక పాత్రను ఇంతలా ప్రేమించటమా? అంతలా లీనం కావటమా? అన్నఆశ్చర్యంతో పాటు.. తాను చేసే పాత్ర విషయంలో ఆమెకున్న కమిట్ మెంట్ చూసినప్పుడు ముచ్చట పడకుండా ఉండలేం.
తాను ఏదైనా పాత్రకు ఓకే అన్న తర్వాత.. తనను తాను ఆ పాత్రలో చూసుకోవటం మొదలెడతానని చెబుతోంది. చెబితే ఫన్నీగా ఉంటుంది కానీ.. తానోచిత్రం చేసిన తర్వాత తనకో రకమైన పిచ్చి పడుతుందని.. ఆ పాత్రలోనే తాను ఉండిపోతానని చెప్పింది తాప్సీ. తాను నటించిన పాత్రలోనే తాను ఉండిపోతానని.. తనకు మరోదారి లేదని చెబుతుంది. ఇదొక క్యారెక్టర్ కాదు.. నా జీవితం ఇదేనని తాను నమ్ముతానని.. ఇంటెన్స్.. ఎమోషనల్ రోల్ చేశాక.. ఆ పాత్ర నుంచి బయటకు రావటం కోసం తాను పడే తిప్పలు చాలానే ఉంటాయని చెప్పింది.
తాను చేసిన పాత్రతో డిస్ కనెక్ట్ కావటం కోసం వారం రోజులు హాలీడేకు వెళ్లటం.. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం చేస్తానని చెబుతోంది. అయినప్పటికీ వంద శాతం ఆ పాత్ర తనలోపల నుంచి బయటకు వెళ్లదని.. ఒక పది శాతం తనలోనే ఉంటుందని చెప్పింది. ఒక సినిమాలో చేసిన పాత్ర తర్వాత ఏదో ఒక మార్పు తనలో తీసుకొస్తుందని.. తాను కొంత మారుతానని చెబుతోంది తాప్సీ. సినిమాలో నటించటం కంటే జీవించటం లాంటివి చేసే తాప్సీ లాంటోళ్లు చాలా అరుదుగా ఉంటారని చెప్పాల్సిందే. మొత్తానికి సినిమా చేశాక తన మూడ్ గురించి ఇంత ఓపెన్ గా చెప్పిన తాప్సీని మెచ్చుకోవాల్సిందే.