Begin typing your search above and press return to search.

ఆలియా వ‌ల్ల 'ఆచార్య'కు త‌ల‌నొప్పి?

By:  Tupaki Desk   |   10 Jun 2020 8:10 AM GMT
ఆలియా వ‌ల్ల ఆచార్యకు త‌ల‌నొప్పి?
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ టాలీవుడ్ ప్ర‌వేశం ఆస‌క్తి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఏరికోరి ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి ఎంపిక చేయ‌డంతో ఆలియాలో అంతగా ఏం ఉందో చూడాల‌న్న ఆస‌క్తి చ‌ర‌ణ్ - తార‌క్ అభిమానుల్లో పెరిగింది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతకం చేసినప్ప‌టి నుంచి ఇరువురు హీరోల ఫ్యాన్స్ ఆలియాకి అభిమానులైపోయారు. అయితే ఆలియాలో సీన్ ఎంతో ఇంకా తేల‌లేదు. త‌న‌పై స‌న్నివేశాలేవీ ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌కెక్కించిందేం లేదు. ఏప్రిల్ లోనే షూటింగ్‌లో చేరాల్సి ఉన్నా అనూహ్యంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ నిలిపేశారు. ఆలియా షెడ్యూల్ ని అర్థాంత‌రంగా రద్దు చేయాల్సొచ్చింది.

ఎట్ట‌కేల‌కు ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించాయి. ఈ నెల 15 నుండి చిత్రీక‌ర‌ణ‌ల‌కు అధికారికంగా అనుమతి ల‌భించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించటానికి రాజమౌళి సన్నద్ధమవుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. రాజమౌళి సంసిద్ధంగా ఉన్నా.. ఆలియా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సెట్స్ కి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉందా? అన్న అనుమానాలున్నాయి. ఓవైపు ముంబైలో COVID 19 భయం అంత‌కంత‌కు పెరుగుతోంది. దీంతో అలియా భట్ ఈ స‌న్నివేశంలో సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే వాస్త‌వం ఏమిటి? అన్న‌ది జ‌క్క‌న్న టీమ్ రివీల్ చేస్తుందేమో చూడాలి. అయినా ఆలియా అంగీక‌రించ‌క‌పోతే .. అది రామ్ చ‌ర‌ణ్ కి ఇబ్బందిక‌రం. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసి ఆచార్య సెట్స్ కెళ్లిపోవాల‌న్న‌ది చెర్రీ ప్లాన్. కానీ ఆలియా రూపంలో ఇబ్బంది క‌లిగితే చ‌ర‌ణ్ ఆచార్య షెడ్యూల్ మొత్తం ఫ్లాప్ అవుతుందేమో!! ఇది కొర‌టాల‌కు చిరంజీవికి త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే అవుతుంది.