Begin typing your search above and press return to search.
ముంబై రోడ్లపై చరణ్-అలియాభట్ దుమారం!
By: Tupaki Desk | 11 April 2022 6:01 AM GMTపాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రకి ఫెయిర్ గా బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అలియాభట్ తెరపైకి కనిపించింది కొద్ది సేపే అయినా సీత ఆహార్యంలో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సీతారామరాజు పాత్రకు పర్పెక్ట్ గా ఫిట్ అయింది. ఆ రకంగా అలియాభట్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది సీత. ఇక బాలీవుడ్ లో అమ్మడి క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
యువతరం నుంచి పండు ముసలి వరకూ అలియాభట్ ని అంతా లైక్ చేస్తారు. 'గంగూబాయి కతివాడి' సక్సెస్ తో అలియాభట్ క్రేజ్ రెట్టింపు అయింది. నటిగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతోంది. కపూర్ ఇంట కాబోయే కొడలు. ఇలా అన్ని రకాలుగా అలియాభట్ పాన్ ఇండియాలో మరింత ఫేమస్ అవుతుంది. ఆరంభంలో 'ఆర్ ఆర్ ఆర్' కి ఉత్తరాదిన అంత రెస్పాన్స్ రాలేదు గానీ..నెమ్మదిగా అక్కడా సినిమా పుంజుకుంది.
అక్కడా అనూహ్యా వసూళ్లని సాధించింది. మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ లాంటి నటులు 'ఆర్ ఆర్ ఆర్' ప్రచారంలో పాల్గొనడం కొంత వరకూ కలిసోచ్చింది. ఇలా 'ఆర్ ఆర్ ఆర్' అక్కడా పెద్ద సక్సెస్ సాధించంది.
దీంతో చరణ్ కి మంచి గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు అలియాభట్-రామ్ చరణ్ కు చెందిన హోర్డింగ్స్ ముంబై రోడ్లపై ఓ రేంజ్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ముంబై లో ఎక్కడ చూసినా జంటగా ఇద్దరి హోర్డింగ్ లే కనిపిస్తున్నాయి.
ఓ శీతల పానియాల కంపెనీకి అలియాభట్- చరణ్ బ్రాండ్ వేర్వేరు భాషల్లో అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం..ఇద్దరికీ మంచి పేరు రావడంతో సదరు కంపెనీ ఇలా తమ బ్రాండ్ ని ప్రచారం చేసుకుంటోంది. ముంబై సిటీని మొత్తం రౌండప్ చేసి హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ ఈ మధ్యనే ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ల్లా కనిపిస్తున్నాయి.
'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ లో చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడంతో చరణ్ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇప్పుడు అదే జనం 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ తో నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ అభిమానుల్లోనూ అంతే ఉత్సాహం కనిపిస్తుంది. సినిమాలో తారక్ పాత్రకన్నా చరణ్ పాత్రని హైలైట్ చేసారన్నది మెజార్టీ వర్గం అభిప్రాయం.