Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో `ఎవ‌రు` ఈ స్టార్లు?

By:  Tupaki Desk   |   27 Nov 2021 4:59 AM GMT
కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో `ఎవ‌రు` ఈ స్టార్లు?
X
కేజీఎఫ్ - చాప్ట‌ర్ 1తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ కి టాలీవుడ్ లో అమాంతం క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా అత‌డికి ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కుతోంది. ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో మ‌రోసారి పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది. త్వ‌ర‌లో కేజీఎఫ్ 2 ట్రైల‌ర్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల‌తో వేడి పెంచుతున్న రామ్ చ‌ర‌ణ్ త‌దుప‌రి ప్ర‌శాంత్ నీల్ తో టై అప్ కోసం చూస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన‌ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్న చ‌ర‌ణ్ వెంట‌నే మ‌రో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ శంక‌ర్ తో సినిమా చేస్తున్నాడు. ఆర్.సి 15 ఇండియా వైడ్ రికార్డుల‌ను బ్రేక్ చేసే రేంజులో ఉంటుంద‌న్న చ‌ర్చ‌ మెగాభిమానుల్లో కొన‌సాగుతోంది. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయాల‌న్న‌ది ప్లాన్.

ఇక చ‌రణ్ ప్లానింగ్స్ కి ధీటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. మెగా కాంపౌండ్ లో చ‌ర‌ణ్ వ‌ర్సెస్ బ‌న్ని పోటీ ఇటీవ‌ల స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది. ఆ ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీ బెస్ట్ డైరెక్ట‌ర్ల‌ను పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల‌ను లాక్ చేసేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు.

తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ లో కనిపించనున్నాడు. టాలీవుడ్ సర్కిల్స్ స‌మాచారం మేర‌కు.. త‌దుప‌రి మ‌రో ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్ల‌ను బ‌న్ని లాక్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఓవైపు గీత గోవిందం డైరెక్ట‌ర్ పరశురామ్ తో మ‌రోవైపు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తో బ‌న్ని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు `సర్కారు వారి పాట` చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్ పాన్-ఇండియా చిత్రం స‌లార్ కు ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌పైనా అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి త‌దుప‌రి అగ్ర హీరోల‌తో ప‌ని చేయాల‌న్న క‌సితో ఉన్నారు.

అదే క్ర‌మంలో ఈ క్రేజీ దర్శకులిద్దరితో బన్నీ చేతులు కలపడం అభిమానుల్లో ఉత్కంఠ పెంచ‌డం ఖాయం. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్రమే. దేనినైనా అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి. ఇక బన్నీ కంటే ముందే రామ్ చ‌ర‌ణ్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయాల‌ని స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

శంక‌ర్ తో ప్రాజెక్ట్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేసేందుకు చ‌ర‌ణ్ - చిరు బృందం ఇప్ప‌టికే మంత‌నాలు సాగించింద‌న్న గుస‌గుసలు వినిపించాయి. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో క్రేజున్న ద‌ర్శ‌కుల‌ను లాక్ చేసేందుకు అగ్ర హీరోలు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. రాజ‌మౌళి-శంక‌ర్ త‌ర్వాత ఈ వ‌రుస‌లో అంత‌టి క్రేజీ సౌత్ డైరెక్ట‌ర్ గా కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పేరు మార్మోగుతోంది. ప్ర‌శాంత్ నీల్ కోసం చ‌ర‌ణ్ - తార‌క్ - బ‌న్ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తో ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ - మైత్రి వ‌ర్గాలతో ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.