Begin typing your search above and press return to search.
సంక్రాంతి సమరం చరణ్ - ప్రభాస్‌ల మధ్యే
By: Tupaki Desk | 1 March 2022 9:30 AM GMT2022 సంక్రాంతి సమరానికి వరుసగా భారీ చిత్రాలు లూన్ లోకి వచ్చేశాయి. అయితే అనూహ్యంగా ఒమిక్రాన్ , కరోనా థర్డ్ వేవ్ కారణంగా సంక్రాంతి బరిలో దిగాల్సిన సినిమాలు వున్న ఫలంగా వాయిదా పడాల్సి వచ్చింది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ.. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించడం వంటి కారణాలతో భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
తొలిసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటించిన భారీ మల్టీస్టార్ మూవీ కావడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో కి వస్తుందా? అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే తరహాలో ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` కూడా వాయిదా పడింది. జనవరి 14న విడుదల కానున్న ఈ మూవీ ఇప్పడు మార్చికి మారిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే స్టార్ హీరోల కన్ను ఇప్పుడు 2023 సంక్రాంతి రేస్ పై పడింది. 2022 సంక్రాంతి రేస్ మిస్సవడంతో ఇప్పుడు అందరి దృష్టి 2023 సంక్రాంతి పై పడింది. ఇప్పటికే కర్చీఫ్ లు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు వరుసలో నిలిచి డేట్ ని కూడా ప్రకటించేశారు. ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు.
ప్రభాస్ తో పాటు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి నిలవడానికి రామ్ చరణ్ కూడా రెడీ అయిపోతున్నారు. శంకర్ తో కలిసి రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ కే సినిమాని తీసుకురావాలని దిల్ రాజు పట్టుపడుతుండటంతో వచ్చే సంక్రాంతి బరిలో చరణ్ - ప్రభాస్ తో పోటీకి దిగడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మార్చిలో ప్రభాస్ `రాధేశ్యామ్`తో వస్తుండగా చరణ్ .. ఎన్టీఆర్ తో కలిసి `ఆర్ ఆర్ ఆర్`లో వస్తున్న విషయం తెలిసిందే. మార్చిలో కొన్ని రోజుల తేడాతో పోటీపడుతున్న చరణ్ - ప్రభాస్ వచ్చ ఏడాది సంక్రాంతికి పోటీపడటానికి రెడీ యిపోవడం విశేషం.
రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న `ఆదిపురుష్` డిఫరెంట్ జానర్ మూవీ.. చరణ్ - శంకర్ ల కలయికలో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మరో జానర్ ఈ రెండు చిత్రాల జానర్ లు వేరు కాబట్టి ఇద్దరి మధ్య పోటీ వుండే ఛాన్సే లేదు. ఈ రెండు చిత్రాల మధ్యలో కి మరో సినిమా ఎంటరైతేనే పోటీ ఏర్పడుతుంది. అయితే రెండు భారీ చిత్రాల మధ్య మరో స్టార్ సినిమాని రిలీజ్ చేయడం టాలీవుడ్ లో జరగడం లేదు.. జరిగే ఛాన్స్ లేదు కాబట్టి 2023 సంక్రాంతి ప్రభాస్ - చరణ్ లదే అని స్పష్టం అవుతోంది.
ఒక వేళ సూపర్ స్టార్ మహేష్ బాబు రావాలనుకున్నా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మహేష్ బాబు - త్రివిక్రమ్ ల కలయికలో ఓ భారీ మూవీ త్వరలో సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సిన ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో అది సాధ్య మయ్యేలా కనిపించడం లేదు. పోనీ డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నా ఆ నెలని `పుష్ప` టీమ్ లాక్ చేసుకుంది. దసరా సీన్ ని మహేష్ ఎంచుకుంటే బెటర్ అని అంటున్నారు. ఇదే జరిగితే మహేష్ రెండు సంక్రాంతి సీజన్ అని వదులుకున్నట్టే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.