Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుడికి చరణ్.. రానా అల్ ది బెస్ట్

By:  Tupaki Desk   |   10 Nov 2019 11:16 AM GMT
మహేష్ మేనల్లుడికి చరణ్.. రానా అల్ ది బెస్ట్
X
అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా లాంచ్ ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అయిన అశోక్ గల్లా డెబ్యూ సినిమా లాంచ్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రానా దగ్గుబాటి అతిథులుగా హాజరయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు స్క్రిప్ట్ అందించారు. రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ఫస్ట్ షాట్ కు చరణ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో చరణ్ ఫిలిం యూనిట్ కు అల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. " అశోక్ గల్లా ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు కదా.. మీరేమైనా సూచనలు ఇస్తారా?" అని చరణ్ ను అడిగితే "అల్ ది బెస్ట్.. యంగ్ స్టర్స్ కు ఏమీ చెప్పనక్కర లేదు.. వారే మాకు ఏదైనా చెప్పొచ్చు"అంటూ నవ్వేశారు. జదేవ్ గల్లా గారు తనకు క్లోజ్ అనే విషయం చెప్తూ "మాకు ఏజ్ గ్యాప్ ఉంది కానీ ఆయన నన్ను చాలా సన్నిహితుడిలాగా చూసుకునేవారు. మొదటి సారి ఆయన సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు ఆది బెస్ట్" అని చెప్పారు. రానా కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోక్ గల్లాకు.. డైరెక్టర్ శ్రీరాం ఆదిత్యకు ఫిలిం యూనిట్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.