Begin typing your search above and press return to search.

సంతోష‌మే స‌గం బ‌లమ‌న్న‌ చెర్రోపాస‌న

By:  Tupaki Desk   |   9 July 2022 10:12 AM GMT
సంతోష‌మే స‌గం బ‌లమ‌న్న‌ చెర్రోపాస‌న
X
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట అన్యోన్య‌త అన్నివేళ‌లా అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది. ఈ జంట గ‌డిచిన ప‌దేళ్ల‌లో కెరీర్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేసింది. పెళ్లి తర్వాత రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా స్టార్ డ‌మ్ ని పెంచుకునే దిశ‌గా ఆలోచించాడు. ఈ విష‌యంలో ఒత్తిడిని ఎదుర్కొన్నా కానీ అత‌డు పెద్ద స‌క్సెస‌య్యాడు. ఇంతింతై ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఉపాస‌న ఎంటర్ ప్రెన్యూర్ గా కొన‌సాగుతూనే అపోలో హెల్త్ సీఎండీగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు. మ‌రోవైపు చెర్రీ ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లోనూ ఉపాస‌న సాయం అంతా ఇంతా కాదు.

అయితే ఈ దంప‌తుల‌కు వార‌సుల కోసం దేవుని ఆశీస్సులు ఇంకా అంద‌లేదు. దీనిపై అభిమానులు ప‌దే ప‌దే ఉపాస‌నను ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. దానికి ఉపాస‌న ఎంతో బోల్డ్ గా ఆన్స‌ర్స్ ఇస్తోంది. ఇటీవ‌లే సేవ్ సాయిల్ ప్ర‌చారంలో బిజీగా ఉన్న స‌ద్గురూని ఉపాస‌న క‌లిసారు. త‌న‌తో చిట్ చాట్ లో బాహాటంగా త‌మ‌కు పిల్ల‌లు లేర‌ని ప‌దే ప‌దే అభిమానులు ప్ర‌శ్నిస్తున్నార‌ని స‌ద్గురుతో అన్నారు ఉపాస‌న‌. ఈ సంద‌ర్భంగా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సంభాష‌ణ‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. అస‌లు భూమికి భార‌మ‌వుతున్న మాన‌వ‌లోకం గురించి చెబుతూ పిల్ల‌లే వ‌ద్ద‌ని కూడా స‌ద్గురు సూచించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక అరుదైన త్రోబాక్ ఫోటోని పంచుకున్నారు. ఇది ప్రేమకు సింబాలిక్. హ‌బ్బీతో రేర్ మెమ‌రీ. ఈ ఫోటోలో రామ్ చరణ్ - ఉపాసన ఐకానిక్ ఫోజుల‌తో అద‌ర‌గొట్టారు. అయితే ఈ ఫోటోగ్రాఫ్ చాలా పాత‌ది. ఉపాస‌న ఇంత‌కుముందు ప‌లుమార్లు షేర్ చేసారు. కానీ ఇప్పుడు మ‌రోసారి షేర్ చేయ‌డంతో అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఈ పోటోగ్రాఫ్ లో రామ్ చరణ్ సాధార‌ణ చెక్స్ ష‌ర్ట్- డెనిమ్ జీన్స్- జీన్స్ క్యాప్ ధరించి క‌నిపించాడు. వైట్ టాప్ - జీన్స్ లో ఉపాస‌న క‌నిపించింది. బ్లాక్ క‌వాస‌కి క్రూజ‌ర్ తో ఎంతో అందంగా కనిపిస్తున్న ఉపాసన చెంత‌నే చెర్రీ అలా ఫోజిచ్చారు. ఈ ఫోటోను పంచుకుంటూ.. ఉపాసన కామినేని ఇలా రాశారు. ''సంతోషంగా ఉన్న వ్యక్తులు వారి జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకుంటారు. నేను దీన్ని నిజంగా నమ్ముతాను'' అన్నారు.

రామ్ చరణ్ తన కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనను 2021 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల‌తో పాటు భారీ అతిథుల న‌డుమ సాగిన ఘ‌న‌మైన పెళ్లి. 2011 డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకోగా ఆరునెల‌ల్లోనే ఈ జంట పెళ్ల‌యింది. ఇటీవలే వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

ఇటీవల ఉపాసన సద్గురుని కలిసి జనాభా నియంత్రణ కోసం తనకు పిల్లలు వద్దు అని కూడా చెప్పింది. ప్రజలు తన మూడు Rలు.. RRR అంటే సంబంధం.. పునరుత్పత్తి .. జీవితంలో పాత్రను ప్రశ్నిస్తున్నారని స‌ద్గురుకి ఉపాస‌న‌ వెల్లడించింది. పిల్లలపై ఉపాస‌న‌ చేసిన ప్రకటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తన త‌దుప‌రి చిత్రం RC15 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా కనిపించనుంది. అంజ‌లి- సునీల్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు -శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.