Begin typing your search above and press return to search.

శ్రియా ఎంగేజ్మెంట్ లో మెగా దంపతులు

By:  Tupaki Desk   |   23 April 2018 5:03 PM GMT
శ్రియా ఎంగేజ్మెంట్ లో మెగా దంపతులు
X
శ్రియా భూపాల్... ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా?. 2016 ఏడాది వరకు అక్కినేని యువ హీరో అఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నఅమ్మాయే ఈ శ్రియా. ఏమైందో గాని సడన్ గా ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకే బ్రేకప్ అయిపొయింది. అప్పట్లో ఆ న్యూస్ సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆమె ఇప్పుడు మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరుపుకుంది. నిన్న జరిగిన వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

ముఖ్యంగా మెగా పవర్ స్టార్ దంపతులు ఎంగేజ్మెంట్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అలాగే వారి బంధువైన పింకీ రెడ్డి ((ఎంపి సుబ్బిరామి రెడ్డి కూతురు) పుట్టిన రోజు కూడా నిన్ననే కావడంతో ఆ వేడుక కూడా అక్కడే కానిచ్చేశారు. రామ్ చరణ్ - ఉపాసన దంపతులు దగ్గరుండి కేక్ కట్ చేయించారు. ఇక పెళ్లి కొడుకు విషయానికి వస్తే.. అతను ఎవరో కాదు ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డి. ఈ వరుడి తల్లి సంగీత - ఉపాసన మదర్ శోభన అక్కాచెల్లెల్లు.

ఆ విధంగా మెగా ఫ్యామిలీకి వీరు దగ్గరి బంధువులు. పైగా అనిందిత్ రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది. చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ - తెలంగాణలోనే సంపన్న రాజకీయవేత్తల్లో ఒకరైన విశ్వేశ్వర్ రెడ్డి పెద్దకుమారుడు. ఇక అపోలో అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. రామ్ చరణ్ ని చూసి చాలా మంది అతిధులు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.