Begin typing your search above and press return to search.
ఏంటా ఫోజ్? కౌబోయ్ సరసన కౌగర్ల్ ఎవరో..!
By: Tupaki Desk | 3 Nov 2022 5:43 PM GMTచూస్తుంటే ఛమక్కులా ఉందీ జంట! చూడగానే కౌబోయ్ సినిమా సెట్స్ లో దృశ్యమా? అంటూ ఆశ్చర్యపోతున్నారా? ఏదైనా షూటింగ్ లో ఇలా ఫోజులిచ్చారేమో అనుకుంటే పొరపాటే... తాజాగా రామ్ చరణ్ తో కలిసి టాంజానియా ట్రిప్ లో ఉపాసన లుక్ ఫోటోలు చూడగానే అభిమానులకు రకరకాల సందేహాలు పుట్టుకొచ్చాయి. ఎంపిక చేసుకున్న దుస్తులు ... హ్యాట్ .. గాగుల్స్ తో ఈ జంట సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు వీక్షించగానే ఏంటీ లుక్కు? కౌబోయ్ సరసన కౌగర్ల్ ఎవరో..! అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. టాంజానియా వెకేషన్ లో భర్త చెర్రీతో కలిసి ఉపాసన ఎంతో ఎంజాయ్ చేసిందని ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రతియేటా వెకేషన్స్ పేరుతో ఈ జంట విదేశీ షికార్లు చేస్తుండడం చూస్తున్నదే. ఇంతకుముందు ఉపాసన బర్త్ డే సందర్భంగా దక్షిణాఫ్రికాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఫోటోలు వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు అంతే క్రియేటివ్ గా తాజా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. టాంజానియా ఎంతో ప్రత్యేకత కలిగిన ప్రదేశం.
టాంజానియా విస్తారమైన అరణ్య ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన తూర్పు ఆఫ్రికా దేశం. వాటిలో `బిగ్ ఫైవ్` గేమ్ (ఏనుగు- సింహం- చిరుతపులి- గేదె- ఖడ్గమృగం) ఎప్పుడూ యానిమల్ ప్లానెట్ లో చూస్తూనే ఉంటాం. వన్యప్రాణులతో సఫారీ మక్కా అయిన సెరెంగేటి నేషనల్ పార్క్ మైదానాలు ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతానికి నిలయమైన కిలిమంజారో నేషనల్ పార్క్ టాంజానియాలోనే ఉన్నాయి. ఆఫ్ షోర్ లో జాంజిబార్ ఉష్ణమండల ద్వీపాలు.. అరబిక్ ప్రభావాలతో ప్రజా జీవనం కనిపిస్తుంది. ఇక్కడ మాఫియా చాలా ప్రమాదకరం. వేల్ షార్క్‌లు - పగడపు దిబ్బలకు మెరైన్ పార్క్ నిలయం. ఇలాంటి అరుదైన విశిష్ఠతలు ఎన్నో టాంజానియాకి ఉన్నాయి.
త్వరలో శంకర్ తో సెట్స్ కి..!
ప్రస్తుతం చరణ్ - ఉపాసన జంట హైదరాబాద్ కి విచ్చేశారు. తదుపరి చరణ్ షూటింగ్ ల కోసం ప్రిపరేషన్ లో ఉన్నారు. మరో వారంలోనే అతడు శంకర్ తో ఆర్.సి15 షూటింగ్ కోసం న్యూజిలాంట్ వెళుతున్నారు. అక్కడ పది రోజుల పాటు ఒక భారీ సాంగ్ చిత్రీకరణ సాగనుంది. విజువల్ గ్రాండియారిటీతో కూడుకున్న ఈ పాట కోసం అత్యంత భారీగా ఖర్చు చేయనున్నారని తెలిసింది. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక మళ్లీ ఇండియా కి వచ్చి షెడ్యూల్ ని పూర్తి చేస్తారు.
ఇక చరణ్ తదుపరి గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉన్నా ఇంకా దానికి సంబంధించిన అప్ డేట్ రాలేదు. సుకుమార్ లేదా ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేయాలన్నది చరణ్ పట్టుదల. కానీ ఆ ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చెర్రీ తదుపరి డైరెక్టర్ ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ లో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.