Begin typing your search above and press return to search.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు చ‌ర‌ణ్ స‌తీస‌మేతంగా!

By:  Tupaki Desk   |   5 Jan 2023 6:38 AM GMT
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు చ‌ర‌ణ్ స‌తీస‌మేతంగా!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు మ‌రోసారి ఎయిర్ పోర్టులో చిక్కారు. చ‌ర‌ణ్ బ్లాక్ క‌ల‌ర్ దుస్తులపై ఓ స్పెష‌ల్ జాకెట్ ధ‌రించ‌గా..ఉపాస‌న స్కిన్ టైట్ బ్లాక్ ప్యాంట్ పై డార్క్ బ్లూ షోల్డ‌ర్ టీష‌ర్ట్ ధ‌రించారు. ఇద్ద‌రు జంట‌గా విదేశాలు ప్ర‌యాణం అయిన‌ట్లు తెలుస్తుంది. ఇద్ద‌రు మాస్కులు ధ‌రించి కనిపిస్తుండ‌గా...చ‌ర‌ణ్ నెత్తికి టోపీ కూడా ధ‌రించారు.

మ‌రి ఈ ప్ర‌యాణం ఎందాకా? అంటే అమెరికా వ‌ర‌కూ అని తెలుస్తోంది. మ‌ళ్లీ ప్ర‌ప‌చ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోన్న వేళ ఈజర్నీలు ఎంటి అనుకుంటున్నారా? అయితే ఇది త‌ప్ప‌ని జ‌ర్నీ...త‌ప్ప‌క చేయాల్సిన ప్ర‌యాణంగా తెలుస్తోంది.

గ్లోబల్ బ్లాక్ బస్టర్ 'ఆర్ ఆర్ ఆర్' 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం (ఇంగ్లీష్ యేతర) మరియు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగం స‌హా ప‌లు కేట‌గిరిలో అనేక చిత్రాలతో పోటీ ప‌డుతోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ స‌తీస‌మేతంగా లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నారు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 11న జ‌రుగుతుంది.

అంత‌కు ముందు జనవరి 9 న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ (TCL చైనీస్ థియేటర్స్)లోనూ 'ఆర్ ఆర్ ఆర్' స్పెష‌ల్ స్క్రీనింగ్‌ అవుతుంది. ఈ షోకి కూడా రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా చైనా వెళ్లి అక్క‌డ నుంచి అమెరికా ప్ర‌యాణం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ షోకి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌స్తుతం తార‌క్ స‌తీమ‌ణి ప్ర‌ణ‌తీతో క‌లిసి అమెరికాలో ఉన్నారు. తార‌క్ కూడా స‌తీస‌మేతంగా ఈవెంట్కి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. వాళ్ల‌తో పాటు ద‌ర్శ‌కుడు రాజమౌళి..సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం కీరవాణి కూడా హాజ‌ర‌వుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.