Begin typing your search above and press return to search.

మామ్ తో చ‌ర‌ణ్ బ్యూటిఫుల్ సెల్పీ!

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:30 AM GMT
మామ్ తో చ‌ర‌ణ్ బ్యూటిఫుల్ సెల్పీ!
X
ఖాళీ స‌మ‌యం దొరికితే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కుటుంబంతోనే గ‌డుపుతారు. కాల‌క్షేప‌మంతా ప్రియ‌మ‌ణి స‌తీమ‌ణి ఉపాస‌న‌.. మూగ‌జీవాల‌తోనే టైంపాస్ చేస్తారు. పెంపుడు గుర్రాలతో...పప్పీలతో ఆడుకోవడం ఓ హబీగా ట్రీట్ చేస్తారు. అప్పుడప్పుడు బాద్ షా గుర్రమెక్కి రైడ్ కి వెళ్తారు. వీలున్నప్పుడల్లా వాటి ఆలనా పాలనా స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు.

ఇక చరణ్ ఎక్కువగా ఇష్టపడే రైమ్ అనే కుక్క పిల్ల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. రైమ్ చరణ్ ప్రాణ సమానం. అతను ఎక్కడ ఉంటే రైమ్ అక్కడ ఉంటుంది. చ‌ర‌ణ్‌-రైమ్ మ‌ధ్య బాండింగ్ అలాంటింది. తాజాగా చ‌ర‌ణ్ మామ్ సురేఖ‌ తో దిగిన ఓసెల్పీ నెట్టింట వైర‌ల్ అవుతంది. ఇందులో చర‌ణ్ అమ్మ‌ని ఆప్యాయంగా హ‌త్తుకుని క‌నిన‌పిస్తుండ‌గా..మ‌రో చేతిలో రైమ్ క‌నిపిస్తుంది.

ముగురు క‌లిసి దిగిన ఈ సెల్పీ మెగా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. మామ్ అంటే చర‌ణ్ కి ఎంతో ఇష్టం. సురేఖ కి చ‌ర‌ణ్ అంటే చిన్న నాటి నుంచి ఎంతో గారాబం. ఇప్ప‌టికీ ఇద్ద‌రి మధ్య అలాంటి బాండింగ్ కొన‌సాగుతుంది.

ఇదిగో ఇప్పుడిలా మామ్ తో అలాంటి ఆస్వాద‌నే పొందుతున్నారు. చ‌ర‌ణ్ ఈ డేని మామ్ తో స్టార్ట్ చేసారు. ఉద‌యాన్నే అమ్మ‌తో క‌లిసి అద్భుత‌మైన సెల్పీ దిగి ఇలా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ ఫోటో గురించి చ‌ర‌ణ్ ఇలా రాసుకొచ్చారు. "ఇంత‌కన్నా మంచి పోస్ట్ తో నేను ఈరోజుని స్టార్ట్ చేయ‌కుండా ఉండ‌లేను' అని త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ ఫోటోని ఉద్దేశించి అభిమానులు సైతం అంతే ఆస‌క్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో షూటింగ్ బంద్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డాన్ని ఆస్వాదిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి మ‌ళ్లీ య‌ధా విధిగా షూటింగ్ లు మొద‌ల‌వుతున్నాయి. ఈనేప‌థ్యంలో చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ కూడా మ‌ళ్లీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ఆర్ సీ 15 చిత్రీక‌ర‌ణ 70 శాతం పూర్తిచేసారు. బ్యాలెన్స్ షూటింగ్ కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని టీమ్ భావిస్తోంది.