Begin typing your search above and press return to search.

వీడియో: 'RRR' సెట్ లో గ్రాండ్ గా చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

By:  Tupaki Desk   |   27 March 2021 12:00 PM GMT
వీడియో: RRR సెట్ లో గ్రాండ్ గా చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..!
X
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఒకరోజు ముందుగానే అంటే శుక్రవారం రాత్రి RRR సెట్లో చరణ్‌ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు దీనికి సంబంధించిన వీడియోని విడుదల చేశారు.

ఇందులో ఆకాశంలో బాణసంచా వెలుగుల్లో 'హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్' అనే సందేశాన్ని చూపించి చరణ్ ను 'ఆర్.ఆర్.ఆర్' బృందం సర్ప్రైజ్ చేసింది. దీని కోసం ఓ భారీ క్రేన్ ను ఉపయోగించినట్లు వీడియోలో కనబడుతోంది. దీనికి కీరవాణి కంపోజ్ చేసిన RRR బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని జత చేశారు. ఇందులో చరణ్ తో పాటుగా డైరెక్టర్ రాజమౌళి - ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య - సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ - కార్తికేయ కనిపిస్తున్నారు. వీరందరూ కేక్‌ కట్ చేసి చరణ్ కు తినిపించారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి తగ్గట్టే భారీగా హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

కాగా, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా కనిపిస్తున్నాడు. తారక్ కు జోడీగా ఒలివియా మోరిస్.. చరణ్ కు జంటగా ఆలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ - నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని - శ్రీయా శరణ్ - హాలీవుడ్‌ స్టార్స్ రే స్టీవెన్‌ సన్ - అలిసన్‌ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దసరా స్పెషల్‌ గా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.