Begin typing your search above and press return to search.

చరణ్ బర్త్‌ డే.. ఆమె వీడియో వైరల్‌

By:  Tupaki Desk   |   28 March 2021 8:30 AM GMT
చరణ్ బర్త్‌ డే.. ఆమె వీడియో వైరల్‌
X
రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా ఆయన అభిమానులు నిన్న సోషల్‌ మీడియాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిర్వహించేందుకు అనుమతులు లేవు. కనుక అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చరణ్‌ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేశారు. అభిమానులు గతంలో చరణ్‌ తో తాము దిగిన ఫొటోలను మరియు చరణ్ పాత సినిమాల వీడియోలు ఫొటోలను తెగ షేర్‌ చేశారు. మొత్తంగా నిన్నంత సోషల్‌ మీడియాలో చరణ్‌ బర్త్‌ డే హడావుడి కనిపించింది. చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా రెండు చేతులు లేని ఒక యువతి డ్రాయింగ్ వేసే వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

చరణ్ కు వీరాభిమాని అయిన ఆ యువతి నోటిలో పెన్సిల్ పెట్టుకుని చరణ్‌ చిత్రంను గీసింది. అద్బుతమైన ఆమె ప్రతిభకు అభిమానులు ఫిదా అవుతున్నారు. చరణ్‌ ఫొటోను ఎంతో మంది ఎన్నో రకాలుగా చిత్రీకరించడం మరియు పెయింట్‌ చేయడం చేశారు. కాని ఇలా రెండు చేతులు లేకున్నా కూడా అద్బుతంగా డ్రా చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే చరణ్‌ అభిమానులు ఈ అభిమాని వీడియోను తెగ షేర్‌ చేసి లైక్స్ చేశారు. ఇలాంటి వారికి సాయం చేయాలన్నా అంటూ చరణ్‌ కు ఆమె తరపున విజ్ఞప్తులు చేశారు.