Begin typing your search above and press return to search.

సోదరికి చరణ్ బర్త్‌ డే శుభాకాంక్షలు.. వైరల్‌ అయిన ఫోటో

By:  Tupaki Desk   |   10 Nov 2022 10:30 AM GMT
సోదరికి చరణ్ బర్త్‌ డే శుభాకాంక్షలు.. వైరల్‌ అయిన ఫోటో
X
మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. తన సోదరి శ్రీజ కొణిదెలకు చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చరణ్ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ తన సోదరిపై ఉన్న ప్రేమను అభిమానంను ఈ ఫోటో మరియు పోస్ట్‌ తో చెప్పకనే చెప్పాడు.

ఈ ఫోటో తో పాటు చరణ్ స్పందిస్తూ.. మా ఇంట్లో అందరికంటే దృఢమైన వ్యక్తి శ్రీజ అంటూ తన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ ఫోటో తో పాటు చరణ్ షేర్ చేసిన మెసేజ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు.

రామ్ చరణ్ మరియు శ్రీజ చాలా క్లోజ్ గా ఉన్న ఈ పోటో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

తన సోదరికి అన్ని విధాలుగా తాను భరోసాగా ఉంటాను.. ఆమెకు తాను మద్దతుగా ఉంటాను అన్నట్లుగా ఈ ఫోటోతో చరణ్ చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆర్‌ఆర్ఆర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చరణ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందంటూ మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.