Begin typing your search above and press return to search.
గుసగుస: చరణ్-బన్ని మెగా మల్టీస్టారర్?
By: Tupaki Desk | 31 Aug 2021 5:28 AM GMTవరుసగా భారీ మల్టీస్టారర్లతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. టాలీవుడ్ స్టార్లను పాన్ ఇండియా హీరోలుగా ఎలివేట్ చేస్తూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాని చాటుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్ - రానా లను బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్లను చేశారు.
ఇప్పుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్లుగా ఆవిష్కరిస్తున్నారు. ఆ ఇద్దరి తర్వాత మహేష్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. జాతీయ స్థాయిలో గొప్ప మార్కెట్ ని కలిగి ఉన్న హీరోలుగా టాలీవుడ్ అగ్రహీరోలను మలిచేందుకు జక్కన్న యూనిక్ వ్యూహాలతో ముందుకు వెళుతుండడం పెద్దగానే వర్కవుటవుతోంది. అందుకే మహేష్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు ఇప్పటికే ఫిక్సయ్యారు.
అలాగే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. మగధీర చిత్రంతో రామ్ చరణ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన రాజమౌళి కోసం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. రాజమౌళి - బన్ని కలయిక కోసం పలు దఫాలుగా ప్రయత్నించినా కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకనో కుదరలేదు. ఎట్టకేలకు మరోసారి అల్లు అరవింద్ ఓ బృహత్తర ప్రణాళికతో ముందుకు వచ్చారని తెలిసింది. ఈసారి రామ్ చరణ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ తో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ని నిర్మించాలన్నది అరవింద్ ప్లాన్. ఒకవేళ అందుకు రాజమౌళి ఓకే చెబితే భారీ ప్యాకేజీని చెల్లించేందుకు ఆఫర్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ కి రాజమౌళి ఓకే చెబుతారా? అన్నది కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.
ప్రస్తుతానికి RRR విడుదల తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ తరువాతి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ ని లాక్ చేయడానికి మెగా నిర్మాత అరవింద్ ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ఒక సాధారణ సినిమా చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. కానీ అది కుదరలేదు. వెంటనే ఆర్.ఆర్.ఆర్ లాంటి మరో భారీ సినిమాని తెరకెక్కించాల్సి వచ్చింది. ఇప్పుడు వెంటనే మరో భారీ మల్టీస్టారర్ కి ఓకే చెబుతారా? అన్నది వేచి చూడాలి. మహేష్ తో చేయాల్సినది కూడా భారీ పాన్ ఇండియా చిత్రం కాబట్టి దానికోసం ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంటుంది. ఇక చరణ్ - బన్ని కలిసి ఇంతకుముందు `ఎవరు?` అనే చిత్రంలో నటించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించగా విజయం అందుకుంది.
మల్టీస్టారర్ ట్రెండ్ కి పెద్ద ఊపు
ఇటీవల మల్టీస్టారర్ ట్రెండ్ అమాంతం ఊపందుకుంది. ఇప్పటికిప్పుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్లతో పాటు ఇతర దర్శకులు పలు మల్టీస్టారర్లను తెరకెక్కిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ హాట్ టాపిక్ గా మారింది. సాగర్ చంద్ర - త్రివిక్రమ్ బృందాలు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. అలాగే కింగ్ నాగార్జున- నాగచైతన్య కథానాయకులుగా బంగార్రాజు ఇటీవలే ప్రారంభమైంది. దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ - దేవరకొండ మల్టీస్టారర్ త్వరలోనే ప్రారంభం కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ - నాగచైతన్య మల్టీస్టారర్ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ అన్ లిమిటెడ్ గా కొనసాగనుంది.