Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ నిడివి ఎంత‌?

By:  Tupaki Desk   |   26 April 2022 6:34 AM GMT
చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ నిడివి ఎంత‌?
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత చిరు నుంచి వ‌స్తున్న సినిమా ఇది. దీంతో అటు అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. రెండేళ్ల త‌రువాత చిరు ఎలాంటి సినిమాతో వ‌స్తున్నారా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ వుంది. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో ఇందులోనూ ఓ సామాజిక అంశం చుట్టూ క‌థ‌ని నడిపించ‌బోతున్నార‌ని అంతా భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ లో చిరు కామ్రేడ్ డ్రెస్ లో గ‌న్ను ప‌ట్టుకుని క‌నిపించిన స్టిల్స్ బ‌య‌టికి రావ‌డం.. సినిమా క‌థ‌పై ప‌లు ర‌కాల క‌థ‌లు వెలుగులోకి రావ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత హైప్ క్రియేట్ అయింది.

అందుకు త‌గ్గ‌ట్టే సినిమాని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్కించిన తీరు ట్రైల‌ర్ లో స్ప‌ష్టం కావ‌డం, ఇందులో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌డం తో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఉత్త‌రాంధ్ర‌లోని న‌క్స‌లిజం నేప‌థ్యాన్ని త‌న క‌థ‌కు ఆపాదించి కొర‌టాల శివ ఈ చిత్రాన్ని అత్యంత శ‌క్తివంతంగా తెర‌కెక్కించారు. అంతే కాకుండా అక్క‌డి ధ‌ర్మ‌స్థ‌లి అంటూ ఓ టెంపుల్ టౌన్ చుట్టూ క‌థ‌ని న‌డిపించార‌ని ట్రైల‌ర్ లో, ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో టీమ్ మెంబ‌ర్స్ బ‌య‌ట‌పెట్ట‌డంతో సినిమాని ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లో చూడాలా అని అంతా ఆస‌క్తిని చూపించ‌డం మొద‌లు పెట్టారు.

సినిమా రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డిన వేళ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించిన చ‌ర‌ణ్ పాత్ర‌పై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర‌మై చ‌ర్చ మొద‌లైంది. ఇందులో చ‌ర‌ణ్ ధ‌ర్మ‌స్థ‌లిలో వుండే గురుకుల్ విద్యార్ధిగా క‌నిపించ‌బోతున్నాడు. అత‌ని పాత్ర ఏంటీ? న‌ఇడివి ఏంటీ? .. అతిథి పాత్ర‌కు మించి వుంటుంద‌ని కొర‌టాల చెబుతున్నా నిడివి విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర న‌పిడివి ఎంత‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

ముందు చ‌ర‌న్ తో సినిమా చేయాల‌నుకున్న కొర‌టాల శివ ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డంతో చిరు పిలిచి నాతో సినిమా ప్లాన్ చేయ‌మ‌న్నార‌ట‌. చిరుతో సినిమా అనుకున్న‌ప్పుడే కొర‌టాల శివ సాధార‌ణ క‌థ కాకుండా కొత్త క‌థ‌తో భారీ త‌నంతో చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. క‌థ రాస్తుంటే కీల‌క పాత్ర పుట్టుకొచ్చింద‌ని, దాన్ని ఎవ‌రితో చేయిస్తే బాగుంటుందా? అని ముందు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు. ఆ త‌రువాత ఆ పాత్ర కోసం మ‌హేష్ బాబు పేరు లైన్ లోకి వ‌చ్చింది. కానీ ఆ పాత్ర‌ని చ‌ర‌ణ్ తో మాత్ర‌మే చేయించాల‌న్న‌ది అంద‌రి ఆలోచ‌న‌. అందుకు ప్ర‌ధాన అడ్డంకిగా `ట్రిపుల్ ఆర్‌` నిలిచింది. రాజ‌మౌళి య‌స్ అంటే చ‌ర‌ణ్‌ కాదంటే మ‌హేష్ అని ఫిక్స‌య్యార‌ట‌.

ఫైన‌ల్ గా రాజ‌మౌళి .. చ‌ర‌ణ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో `ఆచార్య‌` లోకి అడుగుపెట్టాడు. ముందు 15 నిమిషాల పాత్రే అనుకున్న కొర‌టాల.. చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ కార‌ణంగా రో ప‌దిహేను నిమిషాలు నిడివి పెంచేశాడ‌ట‌. అయితే ఇటీవ‌ల చ‌ర‌ణ్ పాత్ర నిడివి 25 నిమిషాలే అని వార్త‌లు వినిపించాయి. తాజాగా లేదు 45 నిమిషాలంటూ మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దీంతో చ‌ర‌న్ నిడివి పై గంద‌ర‌గోళం నెల‌కొంది. తాజాగా దీనిపై క్లారిటీ వ‌చ్చింది. ఫైన‌ల్ గా చ‌ర‌ణ్ పాత్ర నిడివి ఈ మూవీలో 45 నిమిషాలు అని క్లారిటీ వ‌చ్చేసింది. చ‌ర‌ణ్ పాత్ర మొంద‌టి భాగంతో పాటు సెకండ్ హాఫ్ లోనూ క‌నిపిస్తుంద‌ట‌. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కి పండ‌గే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.