Begin typing your search above and press return to search.

పోటీ ప్ర‌పంచంలో అగ్ర హీరోల‌పై చ‌ర‌ణ్ కామెంట్లు

By:  Tupaki Desk   |   21 April 2022 3:11 AM GMT
పోటీ ప్ర‌పంచంలో అగ్ర హీరోల‌పై చ‌ర‌ణ్ కామెంట్లు
X
పోటీ ప్ర‌పంచ‌మిది. ముఖ్యంగా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో కాంపిటీష‌న్ ఇటీవ‌ల ఊహించ‌నంత పెద్ద‌గా ఉంది. మ‌న అగ్ర హీరోలంతా త‌మ స్టార్ డ‌మ్ ని పాన్ ఇండియా రేంజుకు విస్త‌రించే ప‌నిలో ఉన్నారు. దీనికోసం ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ అటు హిందీ హీరోల‌కే స‌వాళ్లు విసురుతున్నారు. ప్ర‌భాస్ ఒక బాట వేశారు. బ‌న్ని-చ‌ర‌ణ్- ఎన్టీఆర్ ఇప్ప‌టికే రేస్ లోకి వ‌చ్చేశారు. తదుప‌రి మ‌హేష్ కూడా వ‌స్తున్నారు. రాజ‌మౌళితో మ‌హేష్ మూవీతో దీనిపై వంద‌శాతం క్లారిటీ వ‌చ్చేస్తోంది. అంటే పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్ వార్ లో అర‌డ‌జ‌ను అగ్ర హీరోలు ఉన్నార‌నే దీన‌ర్థం.

అయితే ఇంత కాంపిటీష‌న్ ఉన్నా కానీ చాలా సింపుల్ గా సాటి హీరోల‌ను పొగిడేయ‌డం వారికి పెద్ద పీట వేయ‌డం అన్న‌ది రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోకే సాధ్యం. టాలీవుడ్ టాప్ స్టార్లు తమ సమకాలీనులను పొగడటం చాలా అరుదుగా క‌నిపిస్తుంది. కానీ అలాంటి ఈగో త‌న‌కు లేద‌ని మెగా హీరో రామ్ చరణ్ నిరూపించారు. `ఆచార్య` సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు- యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓపెన్ గా మ‌న‌సులో మాట‌ మాట్లాడారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ తార‌క్- మ‌హేష్ ల‌ను అత‌డు తెర‌పై ఎలా చూపించాడో వివ‌రించారు. కొర‌టాల‌లో సూక్ష్మభేదం ప‌రిశీల‌న అమోఘంగా ఉంది. అందుకే `టెంపర్ -`జనతా గ్యారేజ్` చిత్రాలను పోల్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లో భారీ వైవిధ్యం కనిపించగా.. శ్రీమంతుడు లో మహేష్ భిన్నంగా కనిపించాడు.

నిజానికి `జనతా గ్యారేజ్‌` లో ఎన్టీఆర్‌ పాత్ర నాకు బాగా నచ్చింది. ఇప్పుడు `ఆచార్య`లో కూడా అదే అనుభూతిని పొందాను... అని తెలిపారు. మహేష్ -ఎన్టీఆర్ లపై చెర్రీ వ్యాఖ్యలు నెటిజ‌నుల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. నెటిజనులు చరణ్ తన సహ నటుల విష‌యంలో ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నారు. దానిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

దర్శకుడు కొరటాల శివ తో ప‌ని అనుభ‌వం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. స్టార్ల‌ను విభిన్న కోణాలలో చూపించి ప్రేక్షకులకు రిఫ్రెష్ అప్పీల్ అందించ‌గ‌ల స‌మ‌ర్థుడు అంటూ పొగిడేశారు. ఆ కోణంలో అత‌డు గ్రేట్ అంటూ ప్ర‌శంసించారు చెర్రీ.

కొరటాల ఒక సన్నివేశాన్ని వివరించినప్పుడు అతను నటుడిని రెండు లేదా మూడు టేక్ లకు వెళ్లమని అడుగుతాడు. ఆపై అతను నటుడిగా నచ్చిన సన్నివేశం మూడ్ ఆధారంగా నిమిషాల్లో మార్పులు చేస్తాడు.. అని కూడా తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్‌ నటించిన మ‌ల్టీస్టార‌ర్ `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కానుంది.