Begin typing your search above and press return to search.
చరణ్ ఎంట్రీ... జక్కన్న చెప్తుంటేనే కళ్లు పెద్దవి అవుతున్నాయి
By: Tupaki Desk | 23 March 2022 5:33 AM GMTరాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా అద్బుతం.. ఆయన సినిమాలోని ప్రతి సన్నివేశం అమోఘం.. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కళాకండం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలుగు వారికి లభించిన అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ రాజమౌళి. అలాంటి రాజమౌళి ప్రతి ఫ్రేమ్ కు కూడా ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు అనడంలో సందేహం లేదు. చిన్న షాట్ విషయంలో కూడా పదుల కొద్ది రీ టేక్ లు చేయించే దర్శకుడు రాజమౌళి.
అలాంటి రాజమౌళి తన సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని మరియు ప్రతి షాట్ ను లవ్ చేస్తాడు. కాని ఆయనకు ఆర్ ఆర్ ఆర్ లో అన్నింటికంటే కూడా ఒక సన్నివేశంకు సంబంధించిన షూట్ సమయంలో కష్టం అనిపించిందట. రీటేక్ కు వెళ్లాలి అంటే భయం కలిగేంత కష్టం గా ఆ సన్నివేశం ఉందట. అదే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎంట్రీ ఇచ్చే షాట్. ఆ షాట్ గురించి జక్కన్న ప్రత్యేకంగా మాట్లాడాడు.
సినిమా ప్రమోషన్ లో భాగంగా హౌరా బ్రిడ్జ్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ ఆర్ ఆర్ హీరోలు మరియు దర్శకులు సినిమా పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఈ సినిమా కోసం తీసిన భయంకరమైన షాట్స్ లో అది ఒకటి అన్నాడు.
జక్కన్న ఇంకా మాట్లాడుతూ.. వెయ్యి మంది రామ్ చరణ్ వెనుక అలా పరిగెత్తుకుంటూ వచ్చే షాట్ అది. అతడిపై దాడి చేసేందుకు సిద్దం అయిన వారిలో కోపం చూపిస్తూ రామ్ చరణ్ పరిగెత్తే సన్నివేశాన్ని చూపించాలి అనుకున్నాం. అది చాలా హై ఓల్టేజ్ షాట్.. ఊహించుకున్నప్పుడే కాస్త కష్టం అనుకున్నా చేశాం. ఒక వ్యక్తి పైకి వెయ్యి మంది గ్యాంగ్ పరిగెత్తుకుంటూ కొట్టేందుకు వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
రామ్ చరణ్ ను ఆ సన్నివేశంలో నటింపజేసే సమయంలో చాలా కష్టపడ్డాం. ఒక సారి దుమ్ము మరియు జనాల మధ్యలో చరణ్ కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా నేను భయపడ్డాను. దేవుడి దయ.. అతడి మంచితనం తో క్షేమంగా అనుకున్నట్లుగా షాట్ ను పూర్తి చేయగలిగాం అంటూ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని జక్కన్న వివరించాడు.
రాజమౌళి అలా చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని వివరిస్తుంటేనే బాబోయ్ అంటూ మైండ్ లో విజువల్స్ వేసుకుని కళ్ల ముందు ఆ షాట్ ను ఊహించుకుని కళ్లు పెద్దవిగా పెంచి మరీ ప్రేక్షకులు చూస్తున్నారు. అద్భుతమైన విజువల్ వండర్ గా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్బుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయం అంటున్నారు. మార్చి 25న విడుదల కాబోతున్న ఈ సినిమా లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ నటించడం ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది.