Begin typing your search above and press return to search.
'భీమ్ ఫర్ రామరాజు' vs 'రామరాజు ఫర్ భీమ్'.. వీళ్ళు ఇంక మారరా..?
By: Tupaki Desk | 22 Oct 2020 4:30 PM GMTప్రస్తుతం సినిమా పరిశ్రమ వర్గాలలో ట్రెండింగ్ టాపిక్స్ అంటే 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'రామరాజు ఫర్ భీమ్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు అంచనాలతో పాటు పోలికలు కూడా పస్తుంటాయి. మా హీరో బాగా చేశాడని.. మీ హీరో మా హీరో ముందు తేలిపోయాడని ఇలా ఫ్యాన్ వార్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ లో నటించడానికి చాలామంది స్టార్ హీరోలు వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇద్దరు హీరోలను సిల్వర్ స్క్రీన్ పై బ్యాలన్స్ గా చూపించే బాధ్యత తీసుకున్నాడు. ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉంటుందని ఎంత చెప్పినప్పటికీ హీరోల ఫ్యాన్స్ మధ్య ఆధిపత్యపోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు - తారక్ అభిమానులు ఒకరిపై ఒకరు కామెంట్లతో దాడి చేసుకుంటున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ పాత్రని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో రిలీజ్ చేసారు. ఇప్పుడు కొమురం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేస్తూ చరణ్ వాయిస్ ఓవర్ తో 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తారక్ - చరణ్ అభిమానులు మధ్య కూడా అదే చిచ్చు రేగింది. ఎన్టీఆర్ వీడియో కంటే చరణ్ వీడియో చాలా వపర్ ఫుల్ గా ఉందని మెగా వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ఎన్టీఆర్ వీడియో బాగున్నప్పటికీ చరణ్ వాయిస్ ఓవర్ సూట్ అవ్వలేదని తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రెండు వీడియోలను కంపేర్ చేస్తూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు హీరోలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వీడియోలు ప్లాన్ చేశాడనేది నిజం. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.
వాస్తవానికి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాలో వర్క్ చేయడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో శుభపరిణామం. దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఇలా ఒకరిపై ఒకరు నెగెటివ్ కామెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. 'మా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు' అని చెప్పినా.. 'నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్' అని పలికినా నెగెటివ్ గా తీసుకునే అభిమానులు మాత్రం కామెంట్స్ చేస్తూనే ఉంటారు. 'మేము మేము బాగానే ఉంటాం.. కానీ మీరే బాగవ్వాలి' హీరోలు స్టేజ్ ఎక్కి చెప్పినా సరే అవేమీ పట్టించుకోకుండా కంపారిజన్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని ఇది మరో స్థాయికి తీసుకెళ్తున్నారే తప్ప ఫ్యాన్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. హీరోల స్థాయిని దిగజార్చే ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి!