Begin typing your search above and press return to search.
మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో RRR..
By: Tupaki Desk | 11 Feb 2023 3:30 AM ISTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా విదేశాల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. విశ్వసినీ వేదికపై ఇప్పటికే పలు పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రం తాజాగా మరో అవార్డు నామినేషన్ కు ఎంపికైంది.
ప్రఖ్యాత డైలీ న్యూస్ పబ్లికేషన్ వల్చర్ ప్రకటించే అవార్డ్ నామినేషన్ కు ఎంపిక అయింది. ఈ అవార్డ్ నిర్వాహకులు.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ పరిచయ సన్నివేశాన్ని.. ప్రపంచ సినిమాలోని టాప్ 5 యాక్షన్ ఫైట్స్‌లో బెస్ట్ ఫైట్‌గా నామినేట్ చేశారు. అలానే బెస్ట్ ఫైట్ తో పాటు ఇంకా ఇతర విభాగాలైనా బెస్ట్ కార్ చేజ్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ మోటార్ సైకిల్ స్టంట్ విభాగాల్లో ఎంపిక చేశారు.
బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిలిం కేటగిరిలో బ్రిడ్జి సీన్, బెస్ట్ ఫైట్లో రాంచరణ్ ఇంట్రో సీన్, బెస్ట్ ఓవర్ ఆల్ యాక్షన్ ఫిలిం లో ఆర్ఆర్ఆర్ మొత్తం చిత్రాన్ని సెలెక్ట్ చేశారు. ఇకపోతే చిత్రసీమకు సేవలందించే స్టంట్ కొరియో గ్రాఫర్స్ , టెక్నీషియన్స్ను ప్రోత్సహించే దిశగా, వారికి గుర్తింపు దక్కేలా ఈ స్టంట్ అవార్డ్స్ ను అందిస్తారు. ఏదేమైనప్పటికీ ఆర్ఆర్ఆర్ కు మరో నామినేషన్ దక్కడం పై అభిమానులు మరోసారి సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా ఏదో ఒక కేటగిరీలో అవార్డును ముద్దాడాలని ఆశిస్తున్నారు.
కాగా, ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అలానే ఈ నామినేషన్‌కు ముందు, తర్వాత గోల్డెన్ గ్లోబ్, గోల్డెన్ టమాటో అవార్డులను అందుకుంది. ఇంకా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్, ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ తదితర వాటిల్లో విజేతగా నిలిచిన ఆర్ఆర్ఆర్... బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళికి ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందించింది. హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిపెట్టింది.
ఇకపోతే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కీలక పాత్రల్లో ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి తెరకెక్కించారు. అలియాభట్, ఓలివియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీల వేదికగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. అలా ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్ నటులు, నిపుణుల నుంచి చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.