Begin typing your search above and press return to search.
మెగా డాడీతో ఫ్రెండుతో శర్వా నైట్ పార్టీ
By: Tupaki Desk | 1 Jan 2023 3:00 PM ISTవెర్సటైల్ స్టార్ శర్వానంద్ ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ తనకంటూ ఒక స్థాయి ఉందని నిరూపించాడు. టాలీవుడ్ లో వైవిధ్యమైన కంటెంట్ ని ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకంగా ముందుకు సాగే హీరోగా అతడికి గుర్తింపు ఉంది. ఇక శర్వానంద్ కి మెగా అండదండల గురించి తెలిసిందే. అతడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక సభ్యుడి తరహా. చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్. ఒకే కంచం ఒకే మంచం అనేంత జిగిరీ దోస్తులు ఈ ఇద్దరూ.
ఇదిగో ఈ ఫోటోగ్రాఫ్ చూసిన వారికి ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. మెగా డాడీ చిరంజీవి .. క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో శర్వా ఇచ్చిన ఫోజ్ చూస్తుంటే అతడంటే మెగా హీరోలకు ఎంతటి అభిమానమో అర్థం చేసుకోవచ్చు. స్నేహానికి విలువిచ్చే చెర్రీ అసలు శర్వాని విడిచి ఉండరని చెబుతుంటారు.
అతడి విలక్షణ శైలి అతడి బలం..
టాలీవుడ్ ఇప్పటివరకు చూసిన యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ శైలి ఏ ఇతర హీరోతో పోల్చినా విభిన్నం. అది అతడి కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తోంది. పైగా జయాపజయాలతో సంబంధం లేకుండా శర్వా తనను తాను మలుచుకున్న తీరు కూడా ఆశ్చర్యకరం. చివరిగా `ఒకే ఒక జీవితం` చిత్రంలో నటించిన ఈ ప్రతిభావంతుడు కొత్త సంవత్సరాన్ని ఘనంగా మెగా కాంపౌండ్ లో జరుపుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ లతో ఈ సెలబ్రేషన్ ఎంతో ప్రత్యేకమైనది. 31 మిడ్ నైట్ మెగాస్టార్ చిరంజీవి తో ప్రత్యేకంగా కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాధించాడు. తాజా ఫోటోలో వీరంతా నవ్వుతూ ఫోటోజెనిక్ గా ఫోజిచ్చారు. ఈ రేర్ క్లిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శర్వానంద్ ఓకే ఒక జీవితం తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. తదుపరి యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. మరో ఇద్దరు దర్శకరచయితలు వినిపించిన కథలను శర్వా లాక్ చేశాడని తెలుస్తోంది.