Begin typing your search above and press return to search.

టైమ్ వేస్ట్ చేయకుడదని ఫిక్స్ అయిన చరణ్!

By:  Tupaki Desk   |   18 Aug 2022 1:27 PM GMT
టైమ్ వేస్ట్ చేయకుడదని ఫిక్స్ అయిన చరణ్!
X
రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు కానీ ఆ తర్వాత ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా మరొక డిజాస్టర్ కూడా ఎదుర్కొన్నాడు. ఆ సినిమా ప్రభావం పెద్దగా చూపకపోయినప్పటికీ తదుపరి సినిమా అయినా నిలకడగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే అది కూడా జరగడం లేదు.

శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న రాంచరణ్ 15వ సినిమా షూటింగ్ మరోసారి మధ్యలో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మరోవైపు శంకర్ కమల్ హాసన్ సినిమాను పూర్తి చేయాల్సి ఉన్నందువలన ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఆపేసే మరి కొన్ని రోజుల తర్వాత మొదలుపెట్టాలని అనుకుంటున్నారట.

వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్నప్పటికీ శంకర్ ఊహించినట్లే ఆలస్యం చేశాడు. ఇక సమ్మర్ కు కూడా రావడం అనేది అనుమానంగానే ఉంది. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ ఆలస్యం చేయకుండా తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయాలి అని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు అనిరుద్ కూడా సంగీతమందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక టాక్ అయితే వస్తుంది.

ఇక మరొకవైపు మరో ఇద్దరి దర్శకులతో కూడా రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డిసెంబర్ సమయానికి అడ్వాన్స్ గా రెండు స్క్రిప్ట్స్ అయినా ఫైనల్ చేయాలని అనుకుంటున్నాడు.
ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ ను లైన్లో పెట్టాడు. అంతేకాకుండా బుచ్చిబాబు కూడా పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడు.

కానీ రామ్ చరణ్ మాత్రం మొదట అనుకున్న శంకర్ ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయడం లేదు. ఇక గౌతమ్ హిందీలో జెర్సీ సినిమాతో కమర్షియల్ గా అయితే ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక అతనితో సినిమా చేస్తే ఎంతవరకు మార్కెట్ కు హెల్ప్ అవుతుంది అనేది మరొక పెద్ద సందేహం.

ఇక ఈ తరుణంలో సుకుమార్ తో పాటు మరో దర్శకుడిని కూడా ఫైనల్ చేయాలని అనుకుంటున్నాడు. సుకుమార్తో అయితే ప్రాజెక్టు ఇప్పట్లో రాదని తెలుస్తోంది. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో చేసే అవకాశం ఉంది. ఇక ఆలోపు చరణ్ మరో రెండు ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి చరణ్ ఎలాంటి దర్శకులను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.