Begin typing your search above and press return to search.

చరణ్‌ తదుపరి సినిమా ఆ ఇద్దరిలో ఎవరితో?

By:  Tupaki Desk   |   2 Nov 2022 12:30 PM GMT
చరణ్‌ తదుపరి సినిమా ఆ ఇద్దరిలో ఎవరితో?
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా శంకర్ సినిమాను మొదలు పెట్టడం జరిగింది. తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సమయంలోనే చరణ్ మరో సినిమా చేయాలని భావించాడు.

శంకర్ సినిమా తో సమాంతరంగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ను చరణ్ చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందాల్సిన చరణ్ మూవీ క్యాన్సిల్‌ అయ్యిందని తెలుస్తోంది. గౌతమ్‌ తో చరణ్‌ తదుపరి సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలు అయ్యింది.

రామ్‌ చరణ్‌ 16వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్ ప్రస్తుతం ఇద్దరు దర్శకుల వైపు చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మొదటగా సుకుమార్‌ వైపు కాగా మరో దర్శకుడు త్రివిక్రమ్‌.

ఇప్పటికే రంగస్థలం సినిమాను సుకుమార్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనిలో ఉన్న సుకుమార్‌ వచ్చే ఏడాది చివరి వరకు అదే సినిమా పనిలో ఉంటాడు. ఇక త్రివిక్రమ్‌ మాత్రం మహేష్ బాబు తో ప్రస్తుతం చేస్తున్న సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నాడు.

శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. కనుక రామ్‌ చరణ్ మరియు త్రివిక్రమ్‌ ఒకే సారి ఖాళీ అవుతారు. దాంతో ఇద్దరి కాంబో లో సినిమా వచ్చే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి చరణ్ తదుపరి సినిమా సుకుమార్‌ తోనా? త్రివిక్రమ్‌ తోనా? అనే విషయంలో ఫ్యాన్స్ క్లారిటీ కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.