Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మూవీ కోసం చరణ్‌, ఎన్టీఆర్‌!

By:  Tupaki Desk   |   21 Oct 2019 9:36 AM GMT
సూపర్‌ స్టార్‌ మూవీ కోసం చరణ్‌, ఎన్టీఆర్‌!
X
టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు ప్రస్తుతం కలిసి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌ పై ఎప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కంటే ముందే మరోసారి వీరిద్దరిని కలిపి చూడబోతున్నాము. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ 'దబాంగ్‌ 3' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా రామ్‌ చరణ్‌ మరియు చరణ్‌ ల సందడి మనం చూడబోతున్నాం.

దబాంగ్‌ 3 చిత్రం డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులు దేశ వ్యాప్తంగా డాన్స్‌ షో లతో అదరగొట్టేయబోతున్నారు. దబాంగ్‌ డాన్స్‌ టూర్‌ హైదరాబాద్‌ లో నవంబర్‌ 2న జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు దబాంగ్‌ టీం సన్నాహాలు మొదలు పెట్టింది.

ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు పాల్గొని సల్మాన్‌ ఖాన్‌ తో డాన్స్‌ చేయబోతున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై బాలీవుడ్‌ వర్గాలతో పాటు అందరిలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ కు జోడీగా సోనాక్షి సిన్హా నటించగా సుదీప్‌... సాయి మంజేర్కర్‌.. అర్బజ్‌ ఖాన్‌ ఇంకా ప్రముఖులు నటించారు.

దబాంగ్‌ 3 ప్రమోషనల్‌ కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌ తో చరణ్‌.. ఎన్టీఆర్‌ లు డాన్స్‌ చేయబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ముగ్గురు స్టార్స్‌ ను ఒకే ఫ్రేమ్‌ లో అదీ డాన్స్‌ చేస్తూ చూడబోతున్న నేపథ్యంలో అందరిలో ఆతృత కనిపిస్తుంది.