Begin typing your search above and press return to search.
నాన్న కోసం చరణ్ మరో రీమేక్ ప్లాన్..?!
By: Tupaki Desk | 8 Oct 2022 5:13 AM GMTమెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా 'గాడ్ ఫాదర్' అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, పూరి జగన్నాథ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తోంది. ఇక గాడ్ ఫాదర్ సక్సెస్ తో రామ్ చరణ్ నాన్న చిరంజీవి కోసం మరో రీమేక్ ను ప్లాన్ చేస్తున్నాడట. వాస్తవానికి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చేయడానికి చరణ్ ప్రధాన కారణం. లూసిఫర్ సినిమాను చూసి నాన్న ఈ సబ్జెక్ట్ మీకు బాగుంటుంది అని చెప్పి ఒప్పించింది చెర్రీనే. దర్శకుడిని కూడా తనే ఫైనల్ చేశాడు.
అలా తెరపైకి వచ్చిన గాడ్ ఫాదర్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కోసం మరో మలయాళ రీమేక్ హక్కులను చరణ్ తీసుకుంటున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ చరణ్ రీమేక్ చేయాలనుకుంటుంది ఏ సినిమానో తెలుసా.. 'భీష్మ పర్వం'. మలయాళంలో మమ్ముట్టి నటించిన గ్యాంగ్ స్టార్ డ్రామా ఇది. అమల్ నీరద్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ క్లాసిక్ 'ది గాడ్ ఫాదర్'తో పాటు భారతీయ ఇతిహాసం మహాభారతం నుంచి ప్రేరణ పొంది 'భీష్మ పర్మం'ను రూపొందించగా.. మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అయితే ఇటీవల ఈ సినిమాను వీక్షించిన రామ్ చరణ్ తన తండ్రి చేత రీమేక్ చేయించాలని నిర్ణయించుకున్నారట.
చిరంజీవికి కూడా కథ నచ్చడంతో ఆ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా పలు మార్పులు చేర్పులు చేసి భీష్మ పర్వంను రీమేక్ చేయనున్నారని అంటున్నారు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.