Begin typing your search above and press return to search.

ఫ్రూటీ యాడ్: సూపర్ స్టైలిష్‌ గా రామ్ చరణ్..!

By:  Tupaki Desk   |   22 March 2022 3:11 PM GMT
ఫ్రూటీ యాడ్: సూపర్ స్టైలిష్‌ గా రామ్ చరణ్..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. ప్రముఖ శీతల పానీయాల కంపెనీ పార్లే ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న మ్యాంగో జ్యూస్ 'ఫ్రూటీ'కి చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తున్నారు. ఇప్పుడు అలియాతో కలిసి చెర్రీ ఈ మ్యాంగో జ్యూస్ ని ప్రమోట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఫ్రూటీ తన టెలివిజన్ వాణిజ్య ప్రకటనని విడుదల చేసింది.

ఇందులో రాంచరణ్ ఓ లైబ్రరీలోని ర్యాక్ లో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. 'ఒకానొక సమయంలో.. అంతకంటే ముందు.. అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడు జరిగింది ఒక జ్యుసీ అద్భుతం..' అంటూ గొప్ప మామిడి రుచి కలిగిన ఫ్రూటీ ఎలా కనుగొనబడింది.. అది అందరికీ ఇష్టమైన పానీయంగా ఎలా రూపుదిద్దుకుంది అనే కథ చెప్పారు చరణ్.

చివర్లో ‘సో ఫ్రూటీ టుగెదర్’ అంటూ చెర్రీ ఒక సిప్ తీసుకుంటాడు. ఈ మ్యాంగో ఫ్రూటీ యాడ్ హిందీతో పాటు అన్ని దక్షిణ భారతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంది. ఇందులో రామ్ చరణ్ పీచ్ కలర్ షర్ట్ మరియు వైలెట్ టోపీ ధరించి ఉబెర్ కూల్ గా సూపర్ స్టైలిష్‌ గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ప‌లు వాణిజ్య ప్రక‌ట‌న‌ల్లో కనిపించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ యాడ్ తో సందడి చేస్తున్నారు. గతేడాది ఈ బ్రాండ్ ని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఆలియా భట్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తుండటంతో.. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ బ్రాండ్ చేతులు మారిందని అనుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కాబోతోంది. ఇక తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న #Rc15 సెట్స్ మీద ఉండగా.. గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించబడింది.