Begin typing your search above and press return to search.

మొద‌టి బిడ్డ మ్యాజిక్ ఆ దేశంలో.. చ‌ర‌ణ్ హింట్!

By:  Tupaki Desk   |   25 May 2023 9:32 AM
మొద‌టి బిడ్డ మ్యాజిక్ ఆ దేశంలో.. చ‌ర‌ణ్ హింట్!
X
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కాశ్మీర్ లో జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ కు హాజరైన సంగ‌తి తెలిసిందే. జి20 సద‌స్సులో పాల్గొన్న తొలి భార‌తీయ న‌టుడిగా చ‌ర‌ణ్ అరుదైన ఫీట్ ని సుసాధ్యం చేశాడు. ప‌లు దేశాల అధికార‌ ప్ర‌తినిధుల న‌డుమ ఘ‌నంగా జ‌రిగిన ఈ ఈవెంట్ లో వివిధ అంశాలపై చర్చిస్తున్నప్పుడు చరణ్ జపాన్ పై తనకున్న ఘాడ‌మైన ప్రేమను బ‌య‌ట‌పెట్టారు. త‌న‌ వ్యక్తిగత జీవితంలో జ‌పాన్ కీల‌క పాత్ర‌ను పోషించింద‌ని మ‌ర్మంగా మాట్లాడారు చెర్రీ.

RRR జ‌పాన్ లో ఘ‌న‌విజ‌యం సాధించింది. చ‌ర‌ణ్ కి ఇప్పుడు జ‌పాన్ లో భారీగా అభిమానులున్నారు. 'నాటు నాటు..'కు అక్క‌డ విశేష ఆద‌ర‌ణ ద‌క్కింది. కానీ ఇవేవీ జ‌పాన్ పై ప్రేమ పుట్ట‌డానికి కార‌ణాలు కావ‌నేది చ‌ర‌ణ్ మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

త‌న‌కు యూర‌ప్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన చ‌ర‌ణ్ ఇప్పుడు జపాన్ తన కొత్త ఫేవరెట్ దేశంగా మారిందని పేర్కొంటూ ఆ దేశ సంస్కృతి ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు చరణ్.

ఇంత‌లోనే జపాన్ తో ఈ లోతైన అనుబంధం వెనుక అస‌లు కారణాన్ని చ‌ర‌ణ్‌ వెల్లడించాడు. అత‌డు స‌ద‌స్సులో కాస్త‌ కొంటెగా నవ్వుతూ.. తన భార్య ఉపాసన కామినేని కొణిదెల ప్రస్తుతం గర్భవతి అని ''జపాన్ లో ఆ మ్యాజిక్ జరిగింది'' అని వెల్లడించాడు.

మొత్తానికి జ‌పాన్ తో ముడిప‌డిన ఈ ప్ర‌త్యేక‌మైన‌ ట్విస్ట్ ఏమిటో ఇప్పుడు మెగాభిమానులు స‌హా ప్ర‌జ‌లకు కూడా తెలిసింది. ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం భార్య‌తో క‌లిసి జ‌పాన్ వెళ్లిన చ‌ర‌ణ్ కి అస‌లు శుభ‌వార్త తెలిసింది అక్క‌డేన‌ని భావించాలి.

ఇత‌ర విష‌యాల‌పైనా ముచ్చ‌టిస్తూ విదేశాల నుండి కళాఖండాలను సేకరించే ఆసక్తి పైనా చ‌ర‌ణ్‌ మాట్లాడారు. తనను తాను ఉత్సాహపూరితమైన కలెక్టర్‌(సేక‌ర‌ణ‌)గా భావించడం లేదని అయినప్పటికీ తాను సందర్శించిన ప్రదేశాలకు రిమైండర్ లుగా కొన్ని వస్తువులను సేక‌రిస్తాన‌ని తెలిపారు.

యూరప్ ఎల్లప్పుడూ చ‌ర‌ణ్‌ హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండగా.. జపాన్ ఇప్పుడు తన కొత్త ఇష్టమైన దేశంగా ఆ స్థానాన్ని ఆక్రమించింది.

రామ్ చరణ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. కియారా అద్వానీ ఇందులో కథానాయిక. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శంక‌ర్ త‌న‌దైన శైలిలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అవినీతి ఎలిమెంట్ ని ప‌రాకాష్ఠ‌లో ఆవిష్క‌రిస్తున్నార‌ని స‌మాచారం.