Begin typing your search above and press return to search.
ఐఎండీబీ టాప్-10 లో చరణ్..తారక్..సమంత!
By: Tupaki Desk | 7 Dec 2022 11:30 AM GMTప్రతీ ఏడాది ప్రఖ్యాత వెబ్ సైట్ ఐఎండీబీ టాప్ -10 సెలబ్రిటీల జాబితాని అనవాయితీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అత్యధిక పాపులారిటీని..క్రేజ్ని ఆధారంగా చేసుకుని ఈ జాబితాని వెల్లడిస్తుంది. తాజాగా 2022 ఏడాదికి సంబంధించిన సెలబ్రిటీల జాబితాని ప్రకటించింది. ఇందులో తెలుగు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కన్నడ నటుడు యశ్... హీరోయిన్ సమంత..కియారా అద్వాణీ స్థానాలు దక్కించుకున్నారు.
ర్యాకింగ్స్ లో చరణ్ నాల్గవ స్థానంలో ఉండగా... సమంత ఐదవ స్థానంలో...టైగర్ 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే బన్నీ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. కేజీఎఫ్ తో ఇండియాని షేక్ చేసిన యశ్ 10వ స్థానంలో ఉన్నారు. ఇక మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో ధనుష్ దక్కించుకోగా..రెండవ స్థానంలో అలియా భట్ ఉంది. ధనుష్ ఇదే ఏడాది హాలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇండియా నుంచి హాలీవుడ్ లో నటించిన స్టార్ కావడంతో ఐఎండీబీ ధనుష్ కి అగ్రతాంబూలం ఇచ్చింది. ఇక బాలీవుడ్ హిట్లు కోసం పాకులాడుతోన్న సయంలో 'గంగూబాయి కతియావాడి' లాంటి విజయంతో ఇండస్ర్టీ పరువు నిలబెట్టిన అలియాకి సెకెండ్ ప్లేస్ కల్పించారు. ఇక చరణ్...ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో ఇండియా సహా హాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.1100 కోట్ల వసూళ్లతో భారత్ లో మూడవ భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది.
అలాగే చరణ్ కి హాలీవుడ్ అవకాశాల కూడా వచ్చాయి. ఎన్టీఆర్ కారణంగా సినిమా ఆస్కార్ కి రీచ్ అయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' తో పాన్ ఇండియాలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా హిందీ బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసింది. ఇలా కొన్ని లెక్కలతో ఐఎండీబీ తెలుగు హీరోలకు తమ జాబితాలో స్థానం కల్పించింది.
అయితే ఇందులో ప్రభాస్ లేడు. దీంతో అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. 'బాహుబలి'తో ఫేమస్ అయిన అటుపై చేసిన సాహో...రాధేశ్యామ్ లాంటి సినిమాల వైఫల్యంతో దెబ్బ పడింది. అలాగే పొన్నియన్ సెల్వన్ తో ఫామ్ లోకి వచ్చిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కి3వ స్థానం దక్కడం విశేషం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐష్ ఈసినిమా తో భారీ సక్సెస్ అందుకుని రేసులో నిలిచింది. అలాగే ఈ జాబితాలో కియారా అద్వాణీకి కూడా చోటు దక్కింది. ఈ ఏడాది అమ్మడు బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే శంకర్ దర్శకత్వంలో ఆర్ సీ 15 లోనూ ఛాన్స్ అందుకుని ఫేమస్ అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.